Political News

నెక్ట్స్ యనమలే.. కానీ.. టీడీపీలో భారీ చర్చ!

టీడీపీకి చెందిన కీలక నాయకుల్లో కొందరికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో ఉద్ధండ నాయకులు చాలా మంది ఉన్నా.. కొన్నాళ్లుగా ఇద్దరు ముగ్గురి పేర్లు బాహాటంగా తెరమీదికి వచ్చాయి. వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు మరింత ప్రముఖంగా వినిపించాయి. ఇక, పూసపాటికి గవర్నర్ పదవి దక్కింది. ఆయన తాజాగా పార్టీకి కూడా రిజైన్ చేశారు. త్వరలోనే గోవా గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పదవీ కాలం పూర్తికావడంతో కొనసాగిస్తారని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పదవి ఇస్తారన్న ఆశతో యనమల ఎదురు చూస్తున్నారు. గవర్నర్ పోస్టులను ప్రకటించిన సమయంలోనూ ఆయన ఎదురు చూసిన విషయం తెలిసిందే.

కానీ, మూడు రాష్ట్రాలకు గవర్నర్లను ప్రకటించినా.. ఒక్కరికి మాత్రమే ఏపీ నుంచి అవకాశం వచ్చింది. ఇక ఇప్పుడు యనమల వంతు వెయిటింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా గవర్నర్ పోస్టు వస్తుందా? లేక మరో నాలుగు మాసాల్లో జరిగే పెద్దల సభ ఎన్నికల్లో ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజ్యసభకు పంపించాలని అనుకున్నా.. ఇప్పట్లో ఎన్నికలకు అవకాశం లేదు. పెద్దల సభకు వెళ్లేందుకు చాలా నెలలు ఎదురు చూడాలి.

ఈ క్రమంలో మరోసారి జరగనున్న గవర్నర్ పోస్టుల షఫిలింగులో యనమలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇదే విషయంపై నాయకులు చర్చించడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకుల్లో ఒక్క యనమలకే మాత్రమే పదవి ఇవ్వాల్సి ఉందని వారు చెబుతున్నారు. మిగిలినవారిలో కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. మరికొందరికి నామినేటెడ్ పదవులు దక్కాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో యనమల వ్యవహారం ఆసక్తిగా మారింది.

This post was last modified on July 22, 2025 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago