కలలు కనండి.. వాటిని సాధించుకునేందుకు కృషి చేయండి.. అన్నారు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ కోవలేకే వస్తారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు ఆయన వినూత్న స్వప్నాలను కంటారు. వాటిని అక్కడితో వదిలేయరు. సాకారం చేసుకు నేందుకు ప్రయత్నిస్తారు. ఇలా మెదలైనవే.. ఉమ్మడి ఏపీలో ఐటీ, సైబరాబాద్ వంటివి. ఆ తర్వాత.. విభజిత ఏపీలోనూ చంద్రబాబు కలలు కన్నారు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్వాంటమ్ వ్యాలీ అంటూ.. వచ్చే ఏడాది జనవరి నాటికి దానిని సాధించేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఇక్కడితో కూడా చంద్రబాబు ఆగలేదు. ‘హైడ్రోజన్ వ్యాలీ’ అంటూ మరో స్పన్నాన్ని తెరమీదికి తెచ్చారు. దీనిని 2030 నాటికి సాకారం చేయాలని నిర్ణయించారు. అప్పటికల్లా రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రూపుదిద్దుకునేలా చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడం ద్వారా భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఏపీని గమ్యస్థానంగా చేయాలన్నది ఆయన ఆలోచన. ఈ క్రమంలోనే ‘గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల’ను స్థాపించేందుకు చంద్రబాబు ప్రైవేటు సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ద్వారా కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పులకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని 2030 నాటికి జీరో స్థాయికి తీసుకురానున్నారు. ఈక్రమంలో విద్యుత్‌ను ఎక్కువగా వినియోగంలోకి తీసుకువస్తున్నారు. విద్యుత్ వాహనాలు ఈ పరంపరలోవే. అయితే.. అన్నీ విద్యుత్ అయిపోతే.. అప్పుడు దానికి కూడా కొరత వస్తుంది కదా?! అనేద ప్రశ్న. దీనికి జవాబే.. ‘గ్రీన్ హైడ్రోజన్’. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్ని సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
This post was last modified on July 22, 2025 12:37 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…