Political News

నిజ‌మే.. వారిలో ఒక్క‌రూ పాసవ‌లేదు ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేప‌ట్టిన ‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు’ కార్య‌క్ర‌మాన్ని ఎంత‌మంది విజ‌యవంతం చేశారు? ఎంత మంది ఇంటికే ప‌రిమితమ‌య్యారు? అంటే.. చాలా మంది ఫెయిల‌య్యార‌న్న‌ది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే స‌హా.. ఇతర మాధ్య‌మాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్య‌క్ర‌మాన్ని ఏవిధంగా విజ‌య‌వంతం చేశార‌న్న‌ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు తెలుసుకున్నా రు. దీని పై ఒక‌టి రెండు నివేదిక‌లు కూడా తెప్పించుకున్నారు.

ముఖ్యంగా కొత్త‌గా ఎన్నికైన తొలి త‌రం ఎమ్మెల్యేల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఏమేరకు భాగ‌స్వామ్యం అయ్యార‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తించారు. దీనిలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఇప్ప‌టికి ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టి 20 రోజులు అవుతున్నాయి. సుప‌రిపాల‌న కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల‌న్న సీఎం చంద్ర‌బాబు ఉద్దేశం. వైసీపీ వ్య‌తిరేక‌త ప్ర‌చారాన్ని త‌గ్గించాల‌న్న‌ది కూడా బాబు వ్యూహం.

అయితే.. ఈ ఉద్దేశాన్ని కొత్త‌త‌రం నాయ‌కులు చాలా వ‌ర‌కు నెర‌వేర్చ‌లేక‌పోయార‌న్న‌ది తాజాగా వ‌చ్చిన నివేదిక తేట‌తెల్లం చేసింది. కొంద‌రు ఒక‌టి రెండు మాత్ర‌మే మొక్క‌బ‌డిగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మ‌రికొంద‌రు.. త‌మ‌కు ఇత‌ర వ్యాపకాలు ఉన్నాయ‌న్నట్టుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఫ‌స్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల్లో 15 మంది వ‌ర‌కు వెనుక‌బ‌డ్డార‌ని స‌మాచారం. మ‌రో 20 మంది అస‌లు ఈ రేసులో పాల్గొన‌లేదని.. కార్య‌క్ర‌మాల‌ను లైట్ తీసుకున్నార‌ని పార్టీకి స‌మాచారం వ‌చ్చింది.

అయితే..వారెవ‌రు? అనే విష‌యాన్ని పార్టీ అధిష్టానం నుంచి నాయ‌కుల వ‌ర‌కు కూడా అందరూ గోప్యంగా ఉంచారు. ఎవ‌రూ బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌డం లేదు. దీనికి కార‌ణం.. వీరిని చూసి మిగిలిన వారు కూడా నేర్చుకుంటార‌న్న భావ‌న ఉండి ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఏదేమైనా.. చంద్ర‌బాబు ఏ స్పూర్తితో అయితే.. ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారో.. దానిని నెర‌వేర్చ‌డంలో నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఈ నెల చివ‌రిలో చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయి.. సీరియ‌స్‌గానే వారికి విష‌యాన్ని చెప్పే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on July 21, 2025 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago