మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు.
వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనేక వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నా మంత్రికి మాత్రం రమ్మీ గేమ్ ఆడేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకుండా అసెంబ్లీని ఇలా వినోదం చేసుకుంటోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై మంత్రి కోకాటే స్పందిస్తూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను గేమ్ ఆడలేదని, అసలు ఆ గేమ్‌ను స్కిప్ చేయడానికి ప్రయత్నించానని అన్నారు. అసెంబ్లీ లోయర్ హౌస్‌లో చర్చ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేయగా, పొరపాటున రమ్మీ గేమ్ డౌన్‌లోడ్ అయిందని వివరించారు. గేమ్‌ను తొలగించేందుకు ప్రయత్నించగా అది వెంటనే పోలేదని, కానీ ఆ తర్వాత గేమ్‌ను స్కిప్ చేశానని తెలిపారు. విపక్షాలు సగం వీడియో చూపించి తనను టార్గెట్ చేస్తున్నాయని, ఒకసారి పూర్తి వీడియో చూడాలని ఆరోపించారు.
ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ ఏకం కావడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకుడు సునీల్ తట్కరే, ఎన్సీపీ రెండు వర్గాలు మళ్లీ కలవాలంటే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. జూలై 2023లోనే అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ ఏకం కావడంపై సునీల్ తట్కరే వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇస్తామని ప్రకటించారు. దీన్ని స్వాగతించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోకాటే వీడియో వివాదం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై మరింత వివాదం నడుస్తోంది.
This post was last modified on July 21, 2025 9:48 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…