Political News

‘నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేప‌రిస్థితి ఉండ‌దు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సీఎం చంద్ర‌బాబుకు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. త‌ప్పులు తెలుసుకోవాలని.. త‌క్ష‌ణ మే స‌రిదిద్దుకోవాల‌ని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా త‌న‌పైనైనా.. త‌న పార్టీ నాయ‌కుల‌పైనై నా కూడా త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని.. త‌ప్పుడు సాక్ష్యాల‌తో కేసుల్లో ఇరికిస్తున్నార‌ని అన్నారు. ఇదే సంప్ర‌దాయం కొన‌సాగిస్తే.. రేపు త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతైనా కూడా.. దెబ్బ‌లు తిన్న‌వీళ్లు.. దెబ్బ‌లు త‌గిలిన వీళ్లు.. ప్ర‌తిచ‌ర్య‌గా ఇదే ప‌నిచేయ‌డం ప్రారంభిస్తే.. మీ ప‌రిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు వేసిన విత్త‌నం.. త‌ప్పుడు విత్త‌నం. ఇది రేపు పెరిగి చెట్ట‌వుతుంది. త‌ప్పుడు సంప్ర‌దాయం క‌నుక మాన‌క‌పోతే.. ఎవ‌రిచేతుల్లోనూ వ్య‌వ‌స్థ ఉండ‌ద‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు. చాలా అంటే చాలా త‌ప్పు చేస్తున్నార‌ని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దెబ్బ‌లు తిన్న ప్ర‌తి ఒక్క‌రూ రేపు ఇలానే చేస్తే.. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏంటి? ఆ పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనేది ఒక్క‌సారి ఆలోచ‌న చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

ఎల్ల‌కాలం.. ఇవే రోజులు ఉండ‌వ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ రోజు పైన మీరున్నారు. మ‌ళ్లా నాలుగేండ్ల కు.. కింద‌కు మీరొస్తారు.. మేం పైకి వెళ్తాం. కానీ.. మీరు చేసే త‌ప్పుడు ప‌నులు, సంప్ర‌దాయం.. విష వృక్షం అవుతుంది. నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేప‌రిస్థితి ఉండ‌దు. దెబ్బ‌తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుం ది. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా మేలుకో.. త‌ప్పులు స‌రిదిద్దుకో.. తప్పుడు సంప్ర‌దాయాల‌ను స‌రిదిద్దుకో. అని జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

తాజాగా తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ త‌మ పార్టీ నాయ‌కుల‌పైకేసులు పెడుతున్నార‌ని.. స్టేష‌న్ల‌లో ప‌డేసి కొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇదంతా ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు నారా లోకేష్ చేస్తున్నార‌ని చెప్పారు. ఈ విధానాన్ని మానుకోక‌పోతే.. రేపు ఇంత‌కు ఇంత వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని హెచ్చ‌రించారు.

This post was last modified on July 16, 2025 3:24 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago