అధికారం ఉంది కదా అని మాజీ సీఎం జగన్ గతంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ, గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ జగన్ తీరు మాత్రం మారడం లేదు. స్వయంకృతాపరాధంతో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్…పోలీసులపై చాలాసార్లు నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే జగన్ తీరు మారలేదు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసులను అవమానించేలా జగన్ దుర్భాషలాడిన వైనం షాకింగ్ గా మారింది. రాష్ట్రంలో డీఐజీలందరూ మాఫియా డాన్ లు అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే చంద్రబాబు తన కింద పెట్టుకున్నారని జగన్ ఆరోపించారు. కరప్షన్ లో వారిని భాగస్వాములుగా పెట్టుకొని పబ్బం గుడుపుకుంటున్నారని విమర్శించారు. ఇక, డీఐజీ అనేవాడు ఆయన జోనుకు మాఫియా డాన్ అంటూ ఏకవచనంతో సంబోధించారు జగన్. పోలీసు ఉన్నత స్థాయి అధికారిని దుర్భాషలాడిన వైనంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, ఆయన కింద సీఐలు..డీఎస్పీ…ఇతర పోలీసులు ఆర్మీగా పనిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం వ్యాపారం, పేకాట క్లబ్బులు…బెల్టు షాపుల నిర్వహణ కోసం పర్మిషన్లు, నియోజకవర్గ స్థాయిలో పరిశ్రమ నడవాలంటే ఎమ్మెల్యే కిచ్చే కప్పం దాకా అన్నింటిలో పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలకు రివర్స్ లో డీఐజీలు డబ్బులిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వైసీపీ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని జగన్ అన్నారు. సంస్కరణలు తెచ్చి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశారని చెప్పారు. పోలీసులు తలెత్తుకు పనిచేశారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో టీడీపీకి సంబంధించిన వారి సమస్యలు ఎక్కువగా వచ్చేవని..వాటిని పోలీసులు, కలెక్టర్లు పరిష్కరించేవారని అన్నారు.
This post was last modified on July 16, 2025 2:59 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…