Political News

ఆ పొలిటిక‌ల్‌ మేడంలు అంతే.. అసంతృప్తి..!

రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కురాలు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మై.. సొమ్ములు కూడా రెడీ చేసుకున్నారు. కానీ.. ఏం చేస్తారు.. ఈక్వేష‌న్లు కుద‌ర‌లేదు. టికెట్ ద‌క్క‌లేదు. కానీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన గుర్తింపు ఉంద‌ని చెప్పుకొనే ఆమె.. గ‌తంలో కేంద్ర మంత్రిగా చేసి ఉండ‌డంతో చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్పింది కాదు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో మెంబ‌ర్‌గా నియమించారు. ఎంతో మంది బ‌రిలో ఉన్నా.. కాద‌ని.. ఆమెకు ఇచ్చారు.

అయినా.. స‌ద‌రు మ‌హిళా నాయ‌కురాలిలో మాత్రం అసంతృప్తి క‌నిపిస్తూనే ఉంది. ప్ర‌తి సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించే ప్ర‌జాద‌ర్బార్‌కు హాజ‌రు కావాల‌ని స‌ద‌రు నాయ‌కురాలికి క‌బురు పెట్టారు. తొలుత నిరాక‌రించిన‌.. ఆమె అతి క‌ష్టం మీద మొహ‌మాటానికి అన్న‌ట్టుగా హాజ‌రయ్యారు. ఏదో మ‌మ అని అనిపించారు. ఇంత‌కీ ఆమెకు ఎలాంటి ప‌ద‌వి కావాల‌ని ఆశ ఉందో అనే చ‌ర్చ జ‌రిగింది. కేబినెట్ హోదాతో ఉన్న నామినేటెడ్ ప‌ద‌వి కావాల‌న్న‌ది ఆమె ఆశ‌.

మ‌రి ఈ ఆశ‌, కోరిక‌లు నెర‌వేరుతాయా? అంటే.. క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రిటైర్మెంటు జాబితాలో ఉన్న మ‌హిళా నాయ‌కుల పేర్ల‌లో ఈమె పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఇక‌, గుంటూరుకు చెందిన మ‌రో ఎస్సీనాయ‌కురాలు.. కూడా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. ఈమె వైసీపీ నుంచి.. బ‌య‌ట‌కు వ‌చ్చిన నాయ‌కురాలు. గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ చేయాల‌ని అనుకున్నా.. సేమ్ టు సేమ్ .. ఆమెకు కూడా.. ఈక్వేష‌న్లు కుద‌ర‌లేదు. దీంతో ఆమె సామాజిక వ‌ర్గానికి చెందిన‌ కార్పొరేష‌న్ ప‌ద‌విని ఇచ్చారు.

కానీ దీనిలో చేసేందుకు ప‌నిలేద‌న్న‌ది ఆమె భావ‌న‌. పోనీ.. మీడియా ముందుకు వ‌ద్దామంటే.. ఇప్పుడే కాద‌ని కొంద‌రు సూచించ‌డంతో ఆగిపోయారు. ఇంత‌కీ ఈమె అసంతృప్తి కూడా.. సేమే. త‌న‌కు ప్రాధాన్యం ఉన్న ప‌ద‌విని ఇవ్వ‌లేద‌న్న‌ది ఆమె వాద‌న‌. అంతేకాదు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న పెత్త‌నం ఉండాలన్న కోరిక కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యేనే అయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ త‌న‌మాటే వినాల‌న్న పంతంతో ఉన్నారు. అలాగ‌ని ర‌గడ చేస్తే.. ఇబ్బంది అవుతుంద‌ని సైలెంట్ అవుతున్నారు. అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సో.. ఈ ఇద్ద‌రు మేడంల అసంతృప్తిపై టీడీపీలో పెద్ద ఎత్తునే చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on July 15, 2025 6:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

11 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

36 minutes ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

1 hour ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

2 hours ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

2 hours ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago