కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి.. జనసేన పార్టీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఫలిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టు పెరుగుతోంది. దీనినే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశించారు. బలమైన వైసీపీ ఓటు బ్యాంకును బదాబదలు చేయడంలో రెండు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని జనసేన ముందుకు సాగుతోంది. దీనిలో ప్రధానంగా గ్రామీణ, గిరిజన ఓటు బ్యాంకు కీలకం. వీటిని వైసీపీకి దూరం చేయడం ద్వారా.. కూటమి అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో.. రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, జల్ జీవన్ మిషన్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు. ఇలా.. పవన్ కల్యాణ్ కీలక అంశాలపై దృష్టి పెట్టారు. వాటిని అమలు కూడా చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు కూడా తెప్పిస్తున్నారు. తద్వారా.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు.. వైసీపీకి బలమైన కోటలుగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంకును కూటమికి దఖలు పడేలా చేయాలన్నది వ్యూహం.
తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు.. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. వారికి పవన్ చేస్తున్న పనులు, ఆయన వ్యూహం తాలూకు ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తోందని అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. గ్రామీణ ఓటు బ్యాంకు కూటమివైపే ఉందని.. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఆ తరహా చర్చలేదన్నది ఎమ్మెల్యేలు చెబుతున్న మాట.
వైసీపీ నుంచి చేరకలు కూడా పెరుగుతుండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు స్థానిక ప్రజాప్రతినిధులు జగన్‌ను వదిలి.. జనసేన బాట పట్టా రు. ఇది.. క్షేత్రస్థాయిలో జిల్లా పరిధిలో జనసేనకు ఉన్న ఇమేజ్ చెప్పకనే చెబుతోంది. సహజంగా జిల్లా స్థాయి.. మండలస్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారారంటే.. అక్కడి వాతావరణంలో మార్పు వచ్చిందనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదేకనిపిస్తోందని అంటున్నారు. సో.. మొత్తంగా పవన్ వ్యూహం ఫలిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 15, 2025 5:12 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…