ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చేశారు. ఒకేసారి రైతులకు 20 వేల రూపాయలను అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తదుపరి విడత నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇవ్వాల్సిన బకాయిని కూడా కలిపి ఇస్తామన్నారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున పడతాయని.. వారు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు పోవద్దని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొందరు ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘డోర్ టూ డోర్’ వెళ్లి పింఛన్లు, రేషన్, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్ మెంటు(ఇప్పటికే ఇచ్చినవి) వంటి వాటిపై ఆరా తీశారు.
ఈ క్రమంలోనే మంత్రి నారాయణ రైతులకు సంబంధించిన విషయంపై స్పందించారు. రైతులకు ధాన్యం తాలూకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. రైతు భరోసా పై వైసీపీ నాయకులు తెలిసీ తెలియని విషయాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారి హయాంలో ఎప్పుడు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని.. లేకపోతే.. ఆవివరాలను ప్రజల ముందే పెట్టి పరువు తీస్తామని హెచ్చరించారు. త్వరలోనే రైతులకు మేలు చేసేలా.. రూ.20 వేలను ఇస్తామని మంత్రి తెలిపారు.
వైసీపీ నేతలు జైలుకెళ్లక తప్పదని మంత్రి నారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సహా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. అక్రమాలు చేసిన వారిని వదిలేస్తే.. ప్రజా తీర్పునకు అర్ధం ఉండదని వ్యాఖ్యానించారు. వారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని నారాయణ తెలిపారు.
This post was last modified on July 15, 2025 3:41 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…