టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇది జరిగి ఐదు రోజులు అయింది. ఈ ఐదు రోజుల్లో ఏ ఏ నాయకులు ఎలా పని చేస్తున్నారు? ఏ ఏ నాయకులు ఎలా ఉన్నారు? ఎంతమందిని కలుస్తున్నారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో చంద్రబాబు పరిశీలన చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కీలక విషయం తెలిసింది. సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆశ ఉన్నప్పటికీ.. ఒకవేళ ఇవి అమలు చేయకపోతే తాము ఇబ్బంది పడతమేమో అనే ఆవేదన, కొంతవరకు బెరుకు కూడా టిడిపిలో కనిపించింది. కొంతమంది మంత్రులు కూడా ఇదే వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట చేశారు. పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.
కానీ, తాజాగా గడిచిన ఐదు రోజుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల వద్దకు వెళుతుండడం, వారి నుంచి ఫీడ్ బ్యాక్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు తెలిసిన కీలక విషయం ఏమంటే.. పథకాలు వచ్చినా రాకపోయినా మళ్లీ చంద్రబాబు రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్టు నాయకులకు అర్థమైంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. దీనికి ప్రధాన కారణం.. వైసీపీలో నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
గుండు గుత్తుగా అందరిని వేశ్యలుగా సంబోధిస్తూ.. అమరావతి రాజధాని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ స్పందించకపోవడం, కనీసం క్షమాపణ చెప్పకపోవడాన్ని టిడిపి నాయకులు ప్రస్తావించినప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అవును కనీసం ఆయన స్పందించలేదు ఇది చాలా దారుణం అని వ్యాఖ్యానిస్తున్నట్టు చంద్రబాబుకు తెలిసింది. దీంతో పాటు తమకు పథకాలు అందినా అందకపోయినా మళ్లీ బాబు గారికే ఓటేస్తామని తేల్చి చెప్పినట్టు చంద్రబాబుకు సమాచారం అందింది.
సో దీనిని బట్టి రాష్ట్రంలో వైసిపి పరిస్థితి ఏంటి? వైసీపీ ఆశలు పెట్టుకున్నట్టుగా సంక్షేమ పథకాలను నమ్ముకుంటే వర్క్ అవుట్ అవుతుందా అనేది ఆ పార్టీ అధినేత ఆలోచన చేసుకోవాలి. ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు అది ప్రమాదంగా మారకుండా చూసుకోవడం అనేది రాజకీయ నాయకులకు చాలా కీలక అంశం. ఒకప్పుడు చంద్రబాబు కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. ఒకరిద్దరు నాయకులు చేసిన వివాదాల కారణంగా పార్టీపై చెడు ప్రభావం పడుతుందని భావించినప్పుడు వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు.
వెంటనే ఆయన స్వయంగా వివరణ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదు. తద్వారా ఉన్న ఓటు బ్యాంకును కూడా నాశనం చేసుకునే పరిస్థితిలో వైసిపి దిగజారిపోతోందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి భవిష్యత్తులో అయినా జగన్ ఇలాంటివి రాకుండా చూసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on July 15, 2025 5:21 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…