Political News

పద‌వుల పందేరం.. లెక్క చూస్తున్న చంద్ర‌బాబు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. నామినేటెడ్ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం రెడీ చేసింది. మ‌రో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ ద‌ఫా దాదాపు 3 వేల నామినేట‌డ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసిన వారు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే చైర్మ‌న్‌లు ప‌ద వులు ఇచ్చారు. కానీ, మరింత మంది ఆయా ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో పార్టీని మ‌రింత పుంజుకునే చేయాలంటే.. నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహంగా ముందు కు న‌డిపించాలంటే.. ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ఇవ్వాల్సిందేన‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు. ప్ర‌స్తు తం నాయకులు క్షేత్ర‌స్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జ‌గించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వుల కొడితే త‌ప్ప‌.. ప‌ని జ‌ర‌గ‌ద‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే 3 వేల పైచిలుకు పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇవీ పోస్టులు.. 1) దేవాల‌యాల‌కు క‌మిటీలు. వీటిలో సుమారు 920 పోస్టులు ద‌క్కుతాయి. చిన్న చిత‌కా ఆల‌యాల‌తో పాటు.. ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాలు కూడా ఉన్నాయి. ఆల‌య బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. 920 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో మిత్ర ప‌క్షాలుగా జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వారికి ఉన్న సంఖ్యాబ‌లం ఆధారంగా కేటాయింపులు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

2) మార్కెట్ యార్డు చైర్మ‌న్ పోస్టులు. ఇవి ఏకంగా.. 2852 పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని ప‌త్తి, మిర్చి, పొగాకు.. వంటి బోర్డులతో పాటు.. ఇత‌ర ప్రాంతాల్లోని వ్య‌వ‌సాయ బోర్డులు కూడా ఉన్నాయి. వీటిని కూడా టీడీపీతో పాటు..మిత్ర‌ప‌క్షాలైన జ‌నసేన‌, బీజేపీల‌కు కేటాయిస్తారు. మొత్తంగా ఈ ప‌ద‌వుల పంపిణీకి తాజాగా చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎంపిక చేసే బాధ్య‌త‌ల‌ను పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించారు.

This post was last modified on July 15, 2025 6:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

37 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago