తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత, ప్రస్తుత ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను కూడా పార్టీ ఆమోదించింది. అయితే.. ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు ఇలా రాజీనామా చేయకముందే.. అలా.. మరో పార్టీ చంకనెక్కించుకుంటోంది. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా.. ప్రత్యర్థి పార్టీల నుంచి తాలూ తప్ప అనుకునే నాయకులకే భారీ డిమాండ్ ఉంది.
అలాంటిది ఫైర్ బ్రాండ్ల కు ఎంత డిమాండ్ ఉండాలి?.. ఉంది.. ఉంటుంది కూడా. గతంలో కంగనా రనౌత్ వ్యవహారం కూడా.. ఇలానే సాగింది. మొదట ఆమె కాంగ్రెస్.. తర్వాత.. బీజేపీ పిలిచి ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకోలేదా? ఆమె ఫైర్ బ్రాండ్ అన్నది అందరికీ తెలిసిందే కదా?. మరి రాజాసింగ్ విషయంలో ఏం జరిగింది? ఏ పార్టీ అయినా.. ఆయనను పిలిచిందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. రాజా సింగ్ వ్యక్తిగతంగా మంచి నాయకుడే. ఈ విషయంలో ఎవరూ తప్పుబట్టరు.
ఒక్క రూపాయి అవినీతిని బూతద్దం పట్టుకుని వెతుకుదామన్నా.. ఆయనలో కనిపించదు. ప్రభుత్వం ఇచ్చే జీతంతోనే ఆయన జీవిస్తారన్నది కూడా తెలిసిందే. సొంతగా కారు కూడా లేదు. మనిషి.. నిఖార్సే. ఆయన రాజకీయం కూడా నిఖార్సే. కానీ.. నిప్పు! ఇదే.. పెద్ద చిక్కు!!. ఎంత మన నిప్పే అయినా.. ముద్దు పెట్టుకుంటామా? ఇదే రాజా సింగ్ విషయంలో పెను సమస్య.. పెద్ద సమస్యగా మారింది. ఆయన ముక్కుసూటి తనం.. పక్కా హిందూత్వ వంటివి.. ఇతర పార్టీలకు సుతరామూ నచ్చడం లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. కానీ, రాజా అంత నిఖార్సయి.. నిప్పులు కడిగే హిందూత్వను మాత్రం ఏ నాయకులూ పాటించరు. మైనారిటీలపై అవకాశం.. అవసరం ఉన్నంత వరకే నిప్పులు చెరుగుతారు. అవసరం ఉందని భావిస్తే.. వారినే ఉపయోగించుకుంటారు. ఇటీవల కేంద్రం ఎంపీలను విదేశాలకు పంపించినప్పుడు ఎంఐఎం ఎంపీ.. అసదుద్దీన్‌ను వాడుకోలేదా?. కానీ.. రాజా రాజకీయాలు అలా ఉండవు. అంతా ముక్కు మీదగుద్దినట్టే జరగాలి. అందుకే.. ఇప్పటి వరకు ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోలేదని.. పిలవను కూడా పిలవలేదని తెలుస్తోంది.
This post was last modified on July 12, 2025 10:40 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…