Political News

మా మంచి మ‌హిళా నేత‌.. ఈసారి మంత్రి పోస్టు ఖాయం?

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన వారిలో చాలా మంది మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. వీరిలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా ఉన్నారు. అయితే.. ఎంత మంది ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు? ఎంత మంది సీఎం చంద్ర‌బాబు దృష్టిలో ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇలా చూసుకుంటే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామ నియోజ‌వ‌ర్గం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తంగిరాల సౌమ్య విజ‌యం సాధించారు. ఇటీవ‌లే ఆమె.. లా సెట్‌లో మంచి ర్యాంకు కూడా పొందారు.

నియోజ‌క‌వర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబు ఇచ్చే టాస్కుల‌ను పూర్తి చేయ‌డం లోనూ తంగిరాల ముందున్నారు. తండ్రి ప్ర‌భాక‌ర్‌రావు మ‌ర‌ణంతో 2015లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సౌమ్య‌.. అప్ప‌టి ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు. 2019లో మాత్రం వైసీపీ హ‌వాతో ప‌రాజ‌యం పాలైనా త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన్నారు. నిరంత‌రం.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌లకు చేరువ అయ్యారు. ఈ వ్యూహ‌మే గత ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించేలా చేసింది.

ఇక‌, చంద్ర‌బాబు దృష్టిలోనూ సౌమ్య‌కు మంచి మార్కులు ఉన్నాయి. రాజ‌కీయంగా కూడా ఆమె వైసీపీపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంలోనూ.. ముందున్నారు. ఒక‌వైపు కూట‌మి నాయ‌కుల‌తో క‌లిసి న‌డ‌వ‌డంతోపాటు, మ‌రోవైపు.. సీనియ‌ర్ల‌తోనూ క‌లివిడిగా ఉంటున్నారు. వివాదాల‌కు, సంచ‌ల‌నాల‌కు దూరంగా ఉంటూ.. ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తూ.. పార్టీలైన్ ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తున్న నాయ‌కురాలిగా సౌమ్య పేరు తెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న మంత్రివ‌ర్గంలో ఎవ‌రినైనా తొల‌గించాల్సి వ‌స్తే.. ఆ ప్లేస్‌లో తంగిరాల‌కు ప్రాధాన్యం ఖాయ‌మ‌న్న చ‌ర్చ కూడా ఉంది. సీనియ‌ర్ నాయ‌కుల అంచ‌నా మేర‌కు.. చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకునే అర్హ‌త‌లు సంపూర్ణంగా ఉన్న మ‌హిళానాయ‌కురాల్లో సౌమ్య ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నార‌ని చెబుతున్నారు. అయితే.. ఇది ఇప్ప‌టికిప్పుడు జ‌ర‌గ‌పోయినా.. ఈ త‌ర‌హాలో ఆమె ఎలివేట్ కావ‌డం అనేది మాత్రం రాజ‌కీయంగా ఆమె ప‌రిణితిని, నాయ‌కురాలిగా.. ఆమె ప్ర‌జ‌ల‌కు చేరువ అయిన విధానాన్ని మాత్రంస్ప‌ష్టం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 12, 2025 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

47 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago