వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని గత నాలుగు రోజులుగా ప్రస్తావిస్తున్నారు. 2019, మార్చి 16న జరిగిన ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు? అనేది ఇంకా సస్పెన్సులోనే ఉంది. అనేక విచారణలు, అనేక దర్యాప్తు సంస్థలు దీనిలో పాలుపంచుకున్నా.. ఏళ్ల తరబడి విచారణలు జరిగినా.. విచారణ పరిధి ఏపీ నుంచి తెలంగాణకు చేరినా.. ఈ కేసు మాత్రం ఇప్పటికీ ముడి పడలేదు.
అనేక మందిని విచారించారు… సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అయినా.. ఫలితం కనిపించలేదు. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఈ కేసు వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయినా.. కూడా ఎక్కడా ఈ కేసు ముందుకు సాగడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న సీఎం చంద్రబాబు తన ప్రసంగాల్లో వివేకా కేసును ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇటు కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలోనూ.. కుప్పం పర్యటనలోనూ ఆయన దీనిని ప్రధానంగా చర్చించారు.
వైసీపీ నాయకులు తననే మోసం చేశారని.. తాను అప్పట్లోనే వారిని అరెస్టు చేసి ఉంటే బాగుండేదని.. కానీ.. గుండె పోటు డ్రామాలు ఆడారని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందుకూడా ఇదే విషయం చెప్పారు. మరి ఇప్పుడు మరోసారి ఎందుకిలా చేస్తున్నారు? దీనివెనుక చంద్రబాబు ఆలోచన ఏంటి? అనేది చర్చగా మారింది. గత ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి వస్తే.. వివేకా కేసును తిరగదోడతామని.. వైఎస్ కుమార్తెకు న్యాయం జరిగేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కానీ, ఏడాది పాలన తర్వాత కూడా.. ఈ కేసులో ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోంది. ఎందుకంటే.. ప్రస్తు తంఈ కేసు విచారణ పరిధి.. కేంద్రంలో ఉంది. మరి కేంద్రంలోనూ టీడీపీ మద్దతు ఇస్తోంది.. కేంద్రంలోనూ మంత్రి పదవులు దక్కించుకున్నారు కదా! మరి అయినప్పటికీ వివేకా కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు? అనేది ప్రశ్న. కేంద్రంలో జగన్‌కు ఉన్న పరోక్ష సంబంధాలు కారణంగానే ఇది ముందుకు సాగడం లేదు.
అందుకే.. దీనిని ప్రస్తావించడం ద్వారా.. జగన్‌ను ఇక్కడ డైల్యూట్ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. తరచుగా కేసును ప్రస్తావించడం ద్వారా జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో నే.. ఆయన మరోసారి వివేకా కేసును ఆయుధంగా మార్చుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో జగన్‌ను అష్టదిగ్భంధనం చేయాలన్నది వ్యూహం. అందుకే..మరోసారి వివేకా కేసు తెరమీదికి వచ్చిందని అంటున్నారు.
This post was last modified on July 7, 2025 7:55 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…