ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేనలో కొన్నాళ్లుగా విభేదాలు హల్చల్ చేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీలో ఉన్న నాయకులు కొందరు.. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదిస్తున్నారు. ముఖ్యంగా జనసేన కీలక నాయకులుగా ఉన్న రియాజ్, ఇమ్మడి కాశీనాథ్‌లు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. వైసీపీలో ఉండగా.. తమను ఇబ్బందులకు గురి చేశారని.. ఆయనను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారంటూ.. గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నారు. బహిరంగ వేదికలపై కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం గతంలోనూ పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. అయితే.. మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్ రెండు మూడు సార్లు సర్దిచెప్పారు. అయినప్పటికీ..వారు వెనక్కి తగ్గలేదు. బాలినేని వంటివారి వల్ల ప్రయోజనం లేదని..ఆయన పార్టీలో కోవర్టు వంటి వారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించాలని గతంలో జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న రియాజ్ డిమాండ్ చేశారు. ఇక, కాశీనాథ్ కూడా.. బాలినేని వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆయన కారణంగా జనసేన నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయిందన్నారు.
ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన నాయకులు ఎక్కువ మంది బాలినేని తప్పుబట్టడంతోపాటు.. ఆయనను పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచారు. ఈ వ్యవహారంపై తాజాగా జిల్లాలో పర్యటించిన పవన్‌కల్యాణ్ స్పందించారు. మార్కాపురం లో శుక్రవారం పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం అనంతరం.. ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. బాలినేని తనకు ఆత్మీయుడని.. ఆయన గతంలోనూ మనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జనసేన విషయాల్లో ఆయన పాజిటివ్‌గా వ్యవహరించారని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు ఉంటే.. సరిచేసుకోవాలని.. బాలినేనికి మంచి ఫ్యూచర్ ఉందని.. ఆయన వల్ల పార్టీ మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి విభేదాలు రాకుండా అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో జనసేన విభేదాలకు దాదాపు చెక్ పడినట్టేనని నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి బాలినేని నేరుగా నాగబాబు, పవన్ కల్యాణ్‌లను కలుసుకుని.. ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
This post was last modified on July 5, 2025 11:34 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…