Political News

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ గుడ్ న్యూస్‌!

మీరు నిరుద్యోగులా? అయితే.. ఇది మీకోస‌మే. ఏపీలోని నిరుద్యోగుల‌కు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో చాలా మందికి త‌మ రెజ్యూమ్‌ను తాము రూపొందించుకునే ప‌ద్ధ‌తి కూడా తెలియ‌దు. దీంతో చాలా ప్రైవేటు సంస్థ‌లు.. నిరుద్యోగుల‌కు దూరంగానే ఉండిపోయాయి. నిజానికి ఉద్యోగం ఇచ్చేముందుఏ సంస్థ అయినా.. ఉద్యోగి చ‌దువు, అనుభ‌వంతోపాటు.. సామాజిక సృహ‌, గుణ గ‌ణాల‌ను కూడా రెజ్యూమ్ ఆధారంగానే తెలుసుకుంటుంది. గ‌త నెల‌లో అసోచాం చేప‌ట్టిన స‌ర్వేలో దేశ‌వ్యాప్తంగా 68 శాతం మంది నిరుద్యోగుల‌కు రెజ్యూమ్ ప్రిప‌రేష‌న్ తెలియ‌ద‌ని పేర్కొంది.

ఉదాహ‌ర‌న‌కు టీసీఎస్‌, టీసీఎల్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు ఉద్యోగం ఇచ్చే ముందు.. ఖ‌చ్చితంగా రెజ్యూమ్‌లోని వివ‌రాల‌ను ఆధారంగా చేసుకునే ఇంట‌ర్వ్యూల‌కు, ప‌రీక్ష‌ల‌కు పిలుస్తాయి. కానీ, రెజ్యూమ్‌లోనే త‌ప్పులు దొర్ల‌డం.. వాటిని స‌రిగా పూర్తి చేయ‌క‌పోవ‌డంతోపాటు.. అభ్య‌ర్థి అస‌లు.. రెజ్యూమ్‌లో వెల్ల‌డించాల్సిన అంశాల‌పై కూడా క్లారిటీ లేక‌పోవ‌డంతో అనేక మంది నిపుణులై ఉండి కూడా.. ఉద్యోగాలు పొంద‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు సూప‌ర్ చాన్స్ తీసుకువ‌చ్చింది.

అదే.. ‘నైపుణ్యం’ పోర్ట‌ల్‌. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిరుద్యోగుల‌కు మేలు చేసేలా ‘నైపుణ్యం’ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. రాష్ట్ర స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంగా ద్వారా దీనిని రూపొందించ‌నున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు.. త‌మ విద్య‌, ప్రాంతం, పేరు, ఉపాధి వివ‌రాల‌ను నైపుణ్యం పోర్ట‌ల్‌లో పొందు ప‌రిస్తే.. చాలు అద్భుత‌మైన రెజ్యూమ్‌ను ఇది రూపొందించి.. అందిస్తుంది. త‌ద్వారా.. మెరుగైన ఉద్యోగాల‌ను ఇట్టే పొందే అవ‌కాశం ఉంటుంది.

ఈ మేర‌కు.. నారా లోకేష్‌.. నైపుణ్యం పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు తెలిపారు. 90 రోజులపాటు ఈ పోర్ట‌ల్‌పై అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తారు. జిల్లాలు, మండ‌లాల వారీగా నిరుద్యోగుల‌ను గుర్తించి.. వారి వివ‌రాల‌ను ఈ పోర్ట‌ల్‌లో చేరుస్తారు. త‌ద్వారా.. వారికి రెజ్యూమ్‌ను సౌల‌భ్యం చేయ‌నున్నారు. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రెజ్యూమ్‌ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దుతారు. దీంతో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లో ఉద్యోగాల‌ను సులువుగా పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

This post was last modified on July 5, 2025 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

39 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago