రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన పథకాలు, చేసిన సంక్షేమం, ఇతరత్రా అనేక అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని భావిస్తారు. ప్రధానంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అన్నది చెప్పే ప్రయత్నం చేస్తుంది.
అదే విధంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి వంటి వాటిని కూడా ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమంలో తమను భాగస్వాములు చేయడం లేదని, తమను పిలవడం లేదని, కూటమి భాగస్వామి పక్షాలుగా ఉన్న బిజెపి, జనసేన నాయకులు అనుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి కూటమి కట్టింది… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాత్రమే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. బలమైన శక్తిగా ఎదిగేందుకు, అవసరమైన దారులను వేసుకునే బాధ్యత ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటుంది. ఇందులో ఉమ్మడిగా పాలన మాత్రమే చేస్తారు.. తప్ప రాజకీయాలు చేయడానికి అవకాశం లేదు. ఎవరి రాజకీయం వారిది. ఎవరు ఓటు బ్యాంకు వారిది. అలాంటప్పుడు ఉమ్మడిగా కలిసి ప్రజల మధ్యకు వెళ్లాలి అనేది మంచి పద్ధతి అయినా అలా వెళ్లాలనే నియమమైతే లేదు.
ఎందుకంటే ఒక అభిమాని ఒక పార్టీకి నచ్చొచ్చు. మరొక అభిమానికి ఇంకో పార్టీ నచ్చొచ్చు. కానీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మంచి పనులు చేసుకున్న తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ తమ వంతు ప్రచారం చేసుకోవాలి. ఇందులో టిడిపి కాస్త ముందడుగు వేసింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే విధంగా జనసేన, బీజేపీ పార్టీలు కూడా సొంతంగా కార్యక్రమాలను అమలు చేసుకుంటే ఎవరు మాత్రం కాదన్నారు.
ఎవరు మాత్రం ఆపేయమన్నారు?. వారు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రజలకు దూరంగా ఉండి ఉంటే వారిదే తప్పు అవుతుంది తప్ప కూటమిలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీలకు కూడా టిడిపి ఓటు బ్యాంకు సంపాదించి పెట్టాలని అనడం పొరపాటు. సంస్తా గతంగా బలోపేతం చేయాలని అనుకుంటే పొరపాటే కాబట్టి. టిడిపి చేసింది, ప్రస్తుతం చేస్తున్నదీ తప్పు కాదనేది మేధావుల నుంచి పరిశీలకుల వరకు చెబుతున్న మాట.
This post was last modified on July 4, 2025 11:57 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…