భారత రాజకీయాల్లో ఏ నేత అయినా ఎన్నికల ముందు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత తిరిగి ఎన్నికల సమయంలోనే కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చూస్తే మాత్రం ప్రత్యర్థులైనా ఆయనను అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే.. సీఎంగా తన ఏడాది పాలన ఎలా ఉంది? అంటూ ఆయన నేరుగా ప్రజల్లోకే వెళ్లారు. ఈ తరహా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో బాబును బీట్ చేసే వారు లేరు. గతంలో బాబు నిర్ణయానికి మించి పనిచేసిన నేతలూ లేరు.
బాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇప్పుడు ఏపీవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో “ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారమే ప్రారంభమైన ఈ కార్యక్రమం నెలాఖరు దాకా కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జీలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తిరిగి తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఆయా పథకాల అమలులో ఏమైనా ఇంబ్బందులు ఎదురవుతు న్నాయా? లేదంటే అసలు పథకాలే అందడం లేదా? ఇలా పలు ప్రశ్నలను కూటమి నేతలు ఆయా ఇళ్లల్లోని జనాలను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా ఓ రేంజిలో సాగింది.
అయినా ఎక్కడైనా గడచిన ఏడాదిలో నా పాలన ఎలా ఉంది అని అడిగే నేత మన దేశంలో ఎక్కడైనా కనిపిస్తారా? దీపం పెట్టి వెతికినా దొరకడం కష్టమే. అలాంటిది మరో రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మా పాలన ఎలా ఉందో చెప్పండి అంటూ ఏడాది ముగిసిన వెంటనే ప్రజల వద్దకు తనతో పాటు తన ఎమ్మెల్యేలను, నేతలను పంపే ధైర్యం చంద్రబాబు చేస్తున్నారంటే… నిజంగానే ఆయన ధైర్యం నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టరే అని చెప్పక తప్పదు. ఏ నేత అయినా తాను ఏడాదిలో ఇది చేశా, అది చేశా… ఇంకా చేయాల్సింది కొంత ఉంది అంటూ చెప్పుకుంటారు గానీ బాబు మాదిరిగా నా పాలన ఎలా ఉంది అని మాత్రం అడగరు.
అయినా బాబుకు ఈ మేర ధైర్యం ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే… ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చింది సూపర్ సిక్స్ హామీలే. వాటిలో ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలను నేరుగా అమలు చేసిన చంద్రబాబు ప్రతి మహిళకు రూ.1,500లను పీ4 పథకానికి అటాచ్ చేశారు. అదే విధంగా నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్ మెంట్ స్కీంకు అటాచ్ చేశారు. ఇక మిగిలిన రెండు పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్రం వేసే రైతు భరోసా నిధులతో కలిపి ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఆగస్టు నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఇక పింఛన్ల పంపిణీని బాబు పండుగ మాదిరిగా నిర్వహిస్తున్నారు. చెప్పినవన్నీ చేసిన నేతకు ఈమేర దైర్యం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా.
This post was last modified on July 4, 2025 8:04 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…