“ఔను.. అప్పు చేశాం. కూటమి ప్రభుత్వంలోనూ అప్పులు చేశారని కొందరు(వైసీపీ) యాగీ చేస్తున్నారు. కానీ, వారిలా కాదు. మేం చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం. దీని నుంచి సంపద సృష్టిస్తున్నాం. దానినే ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం. వారిలా(జగన్) అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి మాకు లేదు. అసలు అప్పుల గురించి జగన్‌కు మాట్లాడే హక్కు లేదు.” అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన “ప్రజావేదిక” సభలో ప్రసంగించారు.
తొలుత.. ‘స్వర్ణ కుప్పం’ ప్రాజెక్టులో భాగంగా 1320 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామన్నారు. సుపరిపాల నలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చానని చెప్పారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చామన్న ఆయన.. దీనిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. రూ.3,890 కోట్ల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తామని ఉద్ఘాటించారు.
ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. “అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ. గతేడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం. ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నాం.” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
కుప్పం నియోజకవర్గంలో రూ.1292 కోట్ల విలువైన పనుల్ని చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయన్నారు. `’రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పని చేసాం. గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం. నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. నేడు దీపం 2.0తో ఉచిత సిలెండర్లు ఇస్తున్నాం. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మారుస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలోనూ వంట గ్యాస్ ఉంది. సూర్య ఘర్ పథకంలో ఇక్కడి ప్రతి ఇంటినీ చేర్చాం.” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
This post was last modified on July 3, 2025 12:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…