Political News

కవిత వ్యూహాల పదును మామూలుగా లేదుగా!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఓ రేంజిలో ఎదుగుతున్నారు. అసలు కవిత అడుగు ఏ దిశగా పడనుందన్న విషయంపై ముందుగానే అంచనా వేయడం ఏ ఒక్కరికీ సాధ్యం కావడం లేదని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ లోనే ఉన్నారా? అన్న ఓ జర్నలిస్టు ప్రశ్నకు… “నేను బీఆర్ఎస్ ను ఓన్ చేసుకున్నా. మరి నన్ను బీఆర్ఎస్ ఓన్ చేసుకుందో, లేదో పార్టీనే చెప్పాలి” అంటూ ఆమె ఏ ఒక్కరికీ సాధ్యం కాని కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో ప్రత్యేకంగా కల్వకుంట్ల కుటుంబంలో అన్నాచెల్లెళ్ల పోరు జరుగుతోందని వెల్లడైపోయింది. చెల్లి కవిత విదేశాల్లో ఉండగా ఆమె సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెపై టార్గెట్ చేశారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా కవిత కూడా సేమ్ అన్న మాదిరి వ్యూహాన్నే అమలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు చిట్ చాట్ పేరిట కేటీఆర్ పేరెత్తకుండా ఓ రేంజీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కవిత బీఆర్ఎస్ వీడి సొంత కుంపటి పెట్టుకుంటారన్న పుకార్లు షికారు చేశాయి.

ఈ పుకార్లకు చెక్ పెట్టేసిన కవిత తాను ఎక్కడికీ వెళ్లడం లేదని బీఆర్ఎస్ లోనే ఉంటున్నానని తెలిపారు. తాజాగా సీనియర్ జర్నలిస్టు, టీవీ5 మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తూనే… తన విషయంలో పార్టీ వైఖరి ఏమిటో తనకు తెలియదంటూ చాలా తెలివిగా ప్రశ్న సందించారు. “మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారా?” అని మూర్తి ప్రశ్నించగా… “అందులో సందేహమే లేదు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీని. బీఆర్ఎస్ నిర్మాణంలో భాగస్వామురాలిని, భవిష్యత్తులోనూ పార్టీ నిర్మాణంలో భాగస్వామిగానే ఉంటా” అని కవిత క్లిష్టర్ క్లారిటీగా సమాదానం ఇచ్చారు.

అంతటితో ఆగని కవిత… నేను పార్టీని ఓన్ చేసుకున్నాను. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాను. పార్టీని నేను ఓన్ చేసుకున్నా. మరి పార్టీ నన్ను ఓన్ చేసుకుందా? లేదా? అన్నది పార్టీనే చెప్పాలి అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే… తనకు సంధించిన ప్రశ్నకు సమాదానం ఇస్తూనే… బీఆర్ఎస్ పార్టీ సూటి ప్రశ్నలు సంధించిన తీరు చూస్తుంటే ఆమె రాజకీయ వ్యూహాల్లో రాటుదేలిపోయారన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి కవిత సంధించిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నుంచి సమాధానం వస్తుందా?..సమస్యే లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అసలు కవిత చేస్తున్న ఓ ఒక్క వ్యాఖ్యను కూడా కేటీఆర్ గానీ బీఆర్ఎస్ నేతలు గానీ పట్టించుకుంటున్నదాఖలాలే లేవు.

This post was last modified on July 3, 2025 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago