ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. ఐటీ మ్యాన్ అనే పేరుంది. ఆయన ఉన్నత వర్గాలకు చేరువగా ఉంటారన్న నానుడి కూడా ఉంది. అయితే.. ఇది గతం. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయన మాస్‌కు చేరువ అవుతున్నారు. ప్రతి నెలా 1న సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసేందుకు వెళ్లే క్రమంలో ఆయన పూర్తిస్థాయి మాస్ నాయకుడిగా మారుతున్నారు. అంతేకాదు.. మాస్‌తో కలిసి పోతున్నారు. వారింట్లో టీ, కాఫీలు తయారు చేస్తూ.. తాను తాగుతూ.. వారికి కూడా ఇస్తున్నారు. ఇలా.. మాస్ యాంగిల్‌లో చంద్రబాబు మెప్పిస్తున్నారు.
ఇదేసమయంలో అమరావతి సహా ఇతర ప్రాజెక్టుల విషయంపై ఉన్నతస్థాయి చర్చలు జరపాల్సి వచ్చినప్పుడు.. క్లాస్ కోణంలో కనిపిస్తున్నారు. అయితే.. ఎవరినీ విడిచిపెట్టకుండా ఆయా వర్గాలకు చేరువ అవుతున్నారు. అంటే.. ఒకప్పుడు చంద్రబాబుకు క్లాస్ అనే పేరున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన క్లాస్-మాస్‌ల కలయికగా పాలనను ముందుకు సాగిస్తున్నారు. తద్వారా పేదలకు చేరువ అవుతున్నారు. ఒకప్పుడు మాస్ నాయకుడిగా జగన్‌కు పేరుండేది. తర్వాత.. ఆయన అధికారంలోకి వచ్చాక.. దానిని పక్కన పెట్టారు. బటన్ నొక్కుడు వరకు పరిమితం అయ్యారు. దీనివల్ల ప్రజలకు చేరువ కాలేక పోయారన్న వాదన వినిపించింది.
ఈ నేపథ్యంలో క్లాస్‌తోపాటు మాస్‌ను కూడా ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు నూతన మార్గం ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రతి నెలా 1న మాస్‌తో మమేకం అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పర్యటించిన ఆయన.. చర్మకార కుటుంబానికి చెందిన పోశయ్యతో కలిసి.. రెండు మూడు గంటలపాటు గడిపారు. వారి ఇంటికి వెళ్లారు. ఇంటి గుమ్మంలోని మెట్లపైనే కూర్చున్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకుని చెప్పులు ఎలాకుడతారో అడిగి తెలుసుకున్నారు. డప్పు వాయించారు. ఇలా.. మాస్‌లో ఒక విధమైన చర్చకు వచ్చేలా చంద్రబాబు వ్యవహరించారు. ఈ తరహా పరిస్థితి చంద్రబాబుకు మాస్ నేతగా ముద్ర వేసేందుకు అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
గతానికి భిన్నంగా!
ఇక, చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా సహజంగా స్థానిక అధికారులు, నాయకులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు పుష్ఫగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా ఎదురేగి స్వాగతాలు పలుకు తారు. అయితే.. ఇవన్నీ వద్దనుకున్నారో.. ఏమో చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి పర్యటనలో వాటిని పక్కన పెట్టారు. దీంతో నాయకులు, అధికారులు కేవలం ఒకే ఒక్క గులాబీ పువ్వుతో ఆయనను స్వాగతం పలికారు. ఇది కూడా డౌన్ టు ఎర్త్ అనే మాటను గుర్తు చేసింది. మరి దీనిని మున్ముందు కూడా కొనసాగిస్తారో.. లేదో చూడాలి.
This post was last modified on July 2, 2025 9:46 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…