గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది పరాజయం పాలయ్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అసలు గెలుపే తప్ప.. ఓటమి అన్న మాటే తెలియని నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాదన ఒకవిధంగా ఉంది. కూటమి ప్రభావం, తమకంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలతోనే తాము ఓడామని అంటున్నారు. కానీ, సర్వేపల్లి, గుడివాడ, ప్రొద్దుటూరు, నెల్లూరు సిటీ, ఆత్మకూరు వంటి కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడింది.
ఇవేకాదు.. 75 బలమైన నియోజకవర్గాల్లో పార్టీ ఓడింది. అంటే.. కేవలం కూటమి ఇచ్చిన హామీలే కారణమా? అంటే.. వైసీపీ వాదన ఎలా ఉన్నా.. అక్కడి నుంచి పోటీ చేసిన వారిపైఉన్న వ్యతిరేకత పెరగడం వల్లేనని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు.. 30-40 నియోజకవర్గాల్లో చేసిన ప్రయోగాలు కూడా(ని యోజకవర్గాల షఫ్లింగ్) వికటించాయి. కట్ చేస్తే.. ఇప్పడు పరిస్థితి ఏంటి? ఓడిన వారు తిరిగి గెలుస్తారా? ఇప్పుడు వారిలో ఆ సత్తా ఉందా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ప్రత్యామ్నాయ నాయకులను ఇంకా జగన్ వెతకడం లేదు. పైగా.. ఎవరూ కనిపించడం కూడా లేదు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు ఉన్నా.. చాలా వరకు నియోజకవర్గాల్లో తిరిగి పాతకాపులకే టికెట్లు ఇవ్వాలి. అయితే… వీరిపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత అనేది వైసీపీ అంచనా వేయడం లేదు. అంతా కూటమి వల్లే.. కూటమి ప్రభావం వల్లే ఓడామని అంచనా వేసుకుని.. అక్కడే ఆగిపోతోంది. కానీ.. వాస్తవానికి వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఉంటుంది.
దీనివల్ల కూడా వైసీపీ నాయకులు పరాజయం పాలయ్యారు. దీనిని అంచనా వేసి.. తప్పులు జరిగిన చోట సరిదిద్దే ప్రయత్నాలు ఇంకా చేయడం లేదు. ప్రజల్లోకి నాయకులను పంపిస్తున్నా.. టీడీపీ పాలనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ.. ప్రజల నుంచి `మీ హయాంలో ఏం జరిగిందన్న` ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. దీనికి కారణం చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా కూడా ఫేడ్ అవుట్ అయ్యారు. సో.. వీరిని సంస్కరించకుండా.. అలానే రంగంలోకి దిగితే.. గత ఎన్నికల్లో ఓడిన వీరు ఏమేరకు వికసిస్తారన్నది ప్రశ్నార్థకమేనని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on July 1, 2025 3:08 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…