Political News

బీజేపీ సంస్థాగత ఎన్నికలతో బాబుకేం పని..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో తన పార్టీ వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పార్టీల పనుల్లో చంద్రబాబు వేళ్లు, కాళ్లు పెట్టిన సందర్భాలే లేవని చెప్పాలి. ఇక పొత్తుల్లో ఉన్న పార్టీల వ్యవహారాల్లోనూ ఉమ్మడి నిర్ణయాలైతేనే చంద్రబాబు ఎంటర్ అవుతారు.. అలా కాకుండా కూటమిలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలాంటి బాబుపై ఇప్పుడు ఓ ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ అంట. దానిని ఖండించింది మాత్రం బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అంటే.. ఈ వ్యవహారంలో బాబు ప్రమేయం లేకుండానే ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

చంద్రబాబుపై వచ్చిన ఆ ఆరోపణ ఏమిటంటే… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అభ్యర్థుల ఖరారు కూడా పూర్తి అయ్యింది. ఏపీకి మాధవ్, తెలంగాణకు రాంచందర్ రావులు ఎన్నికయ్యారు. అధికార ప్రకటన మంగళవారం రానుంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.ఈ ఇద్దరి ఎంపికల వెనుక చంద్రబాబు హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందట. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత ఎలా చెబితే అలా నడిచేందుకు బీజేపీ నేతలు జీహుజూర్ అంటున్నారని ఆ పార్టీ నేతలు సెటైర్లు సంధించారు. అసలు కాంగ్రెస్ నుంచి ఈ ఆరోపణలు గుప్పించింది ఎవరన్న విషయం ఇప్పటిదాకా తెలియరాలేదు.

అసలు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేసిందో, లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక పూర్తి అయిన వెంటనే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి తన పార్టీ వ్యవహారాలను ప్రస్తావించడం మానేసి… చంద్రబాబు జోక్యంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో వేరే పార్టీలకు చెందిన నేతలకు ఎంతమాత్రం సంబంధం ఉండబోదని ఆయన అన్నారు. చంద్రబాబు సలహాలతో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించుకునేంత దీన స్థితిలో బీజేపీ లేదని ఆయన ఓ రేంజిలో బాధ పడ్డారు. అనవసరమైన విషయాలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవంగా ఏపీలో మొన్నామధ్య మూడు ఎంపీ సీట్లు ఖాళీ అయితే రెండు సీట్లను తీసుకున్న టీడీపీ, ఓ సీటును బీజేపీకి కేటాయించింది. ఈ సీటును ఎవరికి కేటాయించాలన్న విషయంపై చంద్రబాబు మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఇక ఆ తర్వాత కూటమికి ఎమ్మెల్సీ సీట్లు లభించగా… వాటిలో ఓ సీటును బీజేపీకి కేటాయిస్తే… దానిని బీజేపీ అధిష్ఠానం చంద్రబాబు అంటే గిట్టని సోము వీర్రాజుకు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఆహ్వానించారు కూడా. ఇక ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సాయిరెడ్డి కారణంగా ఖాళీ అయిన సీటును చంద్రబాబు బీజేపీకే కేటాయించారు. ఈ సీటును బీజేపీ అధిష్ఠానం ఏ ఒక్కరూ ఊహించని రీతిలో పాకా సత్యనారాయణకు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని కూడా బాబు అసలు ఎంతమాత్రం పట్టించుకోలేదు. అలాంటి బాబు బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో ఎందుకు కల్పించుకుంటారు?

This post was last modified on June 30, 2025 10:08 pm

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

3 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago