టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు మంచి టార్గెట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రజలను కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చెప్పుకొచ్చారు. అదేసమయంలో పథ కాలపైనా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. ఈ ఒక్కటే కాకుండా.. ఇలా చేసిన వారిని మాత్రమే వచ్చే ఎన్ని కలలో పోటీకి అర్హులుగా నిర్ణయిస్తామని కూడాతేల్చేశారు.
ఇది ఒక రకంగా.. పార్టీలో నాయకులకు ఒక మెలికేనని చెప్పాలి. ఇప్పటి వరకు పార్టీ తరఫున ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు చెబుతున్నా.. చాలా మంది నాయకులు పెడ చెవిన పెడుతున్నారు. దీనిని చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు వారిపై ఒత్తిడి పెంచితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఆయన.. దీనికి సరైన రూట్ వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టికెట్ వ్యవహారంతో నాయకులకు లింకు పెట్టారు.
వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూడా.. చంద్రబాబు ఇలానే టార్గెట్ పెట్టారు. కానీ, అప్పట్లో ఏడాది, ఏడాదిన్నర ముందే ఈ టార్గెట్ పెట్టారు. పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని అటు చంద్ర బాబు ఇటు నారా లోకేష్ కూడా ప్రకటించారు. దీంతో నాయకులు ముందుకు కదిలారు. అయినా.. కదలని వారు కూడా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాల ముందే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీని నుంచి తమ్ముళ్లు తప్పించుకునే అవకాశం లేదని టాక్.
ఎందుకంటే.. ఎన్నికలకు ఏడాదో ఏడాదిన్నరో సమయం ఉంటే.. ఒక ఆర్నెల్లు టైం పాస్ చేసి.. ఎన్నిక లకు ఏడాది ముందు కార్యరంగంలోకి దిగే అవకాశం ఉండేది. కానీ, చంద్రబాబు ఇప్పటి నుంచే తరుము తున్న నేపథ్యంలో ఆయన నుంచి తప్పించుకోవడం నాయకులకు సాధ్యం కాదు. పైగా టికెట్‌తో ముడి పెట్టడం.. కొత్త నాయకులకు అవకాశం ఇస్తామని.. పాత నేతలు తమ మాట వినిపించుకోకపోతే.. వదిలేస్తామని కూడా చంద్రబాబు చెప్పడంతో నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో ప్రజల మధ్యకు రాక తప్పదన్న చర్చ అయితే.. ప్రారంభమైంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 30, 2025 5:51 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…