Political News

‘ప‌లాస‌’ లో ఏం జరుగుతుంది శిరీషగారూ?

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్‌ టాపిక్కే!. ఆ నియోజకవర్గంలో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు ఎన్నికలకు ముందు కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. అదే పలాస నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గౌతు శిరీష విజయం దక్కించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గౌత శిరీష గతంలో ఓడిపోయినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి హవాతోపాటు.. ప్రజల్లో ఆమెకు ఉన్న సింపతి, ప్రజల మధ్య ఉండటం, ప్రజల కోసం పనిచేసిన కారణంగా విజయం దక్కించుకున్నారు.

అయితే ఏడాది కాలంగా ఆమె ఎదురీదుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలు ఎమ్మెల్యేను ఒకరకంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. వైసీపీ నాయకుడు, మాజీమంత్రి అప్పలరాజు రోజుకో విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఎమ్మెల్యే సహా ఆమె కుటుంబం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక, మద్యం అదేవిధంగా భూములకు సంబంధించి శిరీష భర్త వెంకన్న చౌదరి కేంద్రంగా అప్పలరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు శిరీష వివరణ ఇస్తున్నా.. ప్రజల్లో మాత్రం చర్చ అయితే నడుస్తోంది.

మరోవైపు శిరీషకు మద్దతుగా సొంత పార్టీ నాయకులు ఎవరు స్పందించకపోవడం, ఆమెకు అనుకూలంగా ఎవరు అప్పలరాజుకు కౌంటర్లు ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. వాస్తవానికి టిడిపిలో ఐక్యత ఉంటుంది. ఒక నాయకుడిని ప్రత్యర్థులు ఎవరైనా విమర్శిస్తే ఇతర నాయకులు కూడా స్పందించి కౌంటర్ కామెంట్లు చేస్తారు. తద్వారా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో ఉంటారు. కానీ పలాసలో మాత్రం శిరీష తరఫున ఎవరు గళం వినిపించకపోవడం గ‌మ‌నార్హం.

దీంతో ఈ నియోజకవర్గంలో రోజు ఏదో ఒక హాట్‌ టాపిక్ చర్చకు వస్తూనే ఉంది. కొన్ని రోజులు.. సామాజిక వర్గాల ఆధారంగా అప్పలరాజు రాజకీయం చేస్తే.. ఆ తర్వాత వైసిపి నాయకులను కొట్టారంటూ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. అయినా.. ఆయన ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆయన ఎమ్మెల్యేను కార్నర్ గా చేసుకుని చేస్తున్న రాజకీయం మరింత దూకుడుగా ఉందని చెప్పాలి. దీనిని అడ్డుకట్ట వేయడం, నాయకులంతా కలిసి ఉండటం అనేది ఇప్పుడు ప్రధాన అంశం. మరి ఆ దిశగా నాయకులు ముందుకు వెళ్లకపోతే అప్పలరాజు చేస్తున్న రాజకీయమే నిజమనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా శిరీష భర్త వెంకన్న చౌదరి అన్ని విషయాలను జోక్యం చేసుకుంటున్నారని అప్రకటిత ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తున్నారన్నది అప్పలరాజు చేస్తున్న ప్రధాన విమర్శ. దీనిలో ఎంత వాస్తవం ఉందనేది పైకి కనిపించకపోయినా ఏ ఇద్దరు కలిసినా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇది భవిష్యత్తు రాజకీయాలకు మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. దీనిని ఎంత తొందరగా ఆమె పరిష్కరించుకుంటే అంత మంచిదనేది పరిశీలకుల భావన.

మరోవైపు శిరీష ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతివారం ప్రజాదర్బారులు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. కానీ ఆ సమస్యల పరిష్కారం ఎంతవరకు ఉందనేది మరో సమస్య. ఈ క్రమంలో అటు ప్రత్యర్థులను కట్టడి చేయ‌డంతో పాటు ఇటు ప్రజల్లో సానుకూలత మరింత పెంచుకునే దిశగా ఆమె అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయంగా వస్తున్న విమర్శలను తట్టుకుని ముందుకు వెళ్లడం కాకుండా వాటిని ప్రతిఘటించడం ద్వారా మాత్రమే ఆమె మళ్ళీ విజయం సాధించగలుగుతారని అభిమానులు సైతం చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on June 30, 2025 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

43 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago