తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేతల జాబితాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కేంద్రంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాలు సాగిస్తున్న ఎర్రబెల్లి… 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. ప్రస్తుతం వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరో జట్టుగా తలపడుతున్నారు. ఈ పోరు పతాక స్థాయికి కూడా చేరుకుంది. ఇలాంటి సమయంలోనూ ఎర్రబెల్లి జాడ కనిపించడం లేదు.
వాస్తవానికి వరంగల్ జిల్లాలో కొండా వర్సెస్ ఎర్రబెల్లి యుద్ధం ఇప్పటిది కాదు. దశాబ్దాల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. కొండా దంపతులు ఎర్రబెల్లి దయాకర్ రావును రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు ఎన్నెన్నో యత్నాలు చేశారు. అయితే వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఎర్రబెల్లి ఆది నుంచి టీడీపీలోనే కొనసాగారు. అయితే మారీన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో ఎర్రబెల్లి బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కేసీఆర్ కేబినెట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు.
కులమో, ప్రాంతమో, లేదంటే ఇంకే కారణమో తెలియదు గానీ… కాంగ్రెస్ లో ఉన్న కొండా దంపతులు ఎర్రబెల్లికి వ్యతిరేకంగా సాగారు. అప్పటికే టీడీపీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… ఏ ఈక్వేషన్లు కారణమో తెలియదు గానీ చంద్రబాబు కేబినెట్ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. చీఫ్ పదవితోనే ఆయన టీడీపీలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీలో బాబుకు అత్యంత సన్నిహితుల్లో ఎర్రబెల్లి ఒకరు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే కొండా సురేఖకు మంత్రి పదవి రాగా ఆ హోదాతో అసెంబ్లీ సాక్షిగా ఎర్రబెల్లిని బెదరగొట్టే యత్నం చేశారు. అయినా కూడా ఎర్రబెల్లి ఏమాత్రం తగ్గలేదు. అయినా ఇప్పుడు ఎర్రబెల్లి ప్రస్తావన ఎందుకంటే…తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి తాను తీసుకున్న గోతిలో తానే పడిపోతుంటే… ఎర్రబెల్లి నుంచి కనీస స్పందనే లేదు కదా అందుకని.
అయితే ప్రస్తుతం ఎర్రబెల్లి ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ ఎర్రబెల్లి సమకాలీకులంతా రేవంత్ ద్వారా ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోయారు. కారణమేమిటో తెలియదు గానీ ఎర్రబెల్లి మాత్రం కాంగ్రెస్ వైపు ఇప్పటిదాకా చూడనే లేదు. రేవంత్ తో ఎర్రబెల్లికి ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా గానీ ఆయన యాక్టివ్ కావడం లేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన ఓ యంగ్ లేడీ చేతిలో ఓడిపోయిన ఎర్రబెల్లి,.. ఆ తర్వాత పూర్తిగా గాయబ్ అయిపోయారు. కొండా, ఇతర కాంగ్రెస్ నేతల గొడవలతో తనకేం సంబంధం అన్న బావనతో ఎర్రబెల్లి తాజా రాజకీయ పరిణామాలపై పెదవి విప్పడం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on June 29, 2025 10:50 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…