కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో అమిత్ షా వెంట పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాలుపంచుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ దృశ్యాలు తెలుగు నేల ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.
ప్రస్తుత తెలుగు నేల రాజకీయాలను చూస్తుంటే.. అసలు ఇలాంటి దృశ్యాలు కనిపించవనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు వస్తే… బీఆర్ఎస్ పాలనలో పెద్దగా రాష్ట్ర మంత్రులు పాలుపంచుకునే వారే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓ మోస్తరు లిబరల్ గానే ఉన్నా..బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ తమ పాద పద్ధతులను విడిచిపెట్టలేదు. అధికారిక కార్యక్రమాలైనా సరే… ప్రత్యర్థి పార్టీ నేతలను ఆహ్వానించేందుకు ఈ రెండు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వెరసి ఈ తరహా దృశ్యాలు కనిపించడం లేదు.
ఆదివారం నాటి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవాన్ని మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించినా… ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహా సంబంధిత శాఖల మంత్రులకు ఆహ్వానం పలకక తప్పలేదు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఏ కారణం చేతనో హాజరు కాలేదు. అయితే తన బదులుగా ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలను పంపారు. సీఎం ఆదేశాలతో కదిలిన ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్న తీరు నిజంగా అమితంగా ఆకట్టుకుంది.
పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో అమిత్ షా పక్కన ముందు వరుసలోనే కనిపించిన తుమ్మల ఫుల్ ఫోకస్ లో కనిపించారు. ఇక అనంతరం బహిరంగ సభా వేదిక మీద అమిత్ షాకు కుడి పక్కన మరో కేంద్ర మంత్ర కిషన్ రెడ్డి కూర్చోగా… ఆయన పక్కన సీతక్క కూర్చుకున్నారు. సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ కిషన్ రెడ్డి తన పక్క సీటును ఆమెకు ఆపర్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అమిత్ తర్వాత రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇద్దరు పాల్గొన్నా… పసుపు బోర్డును సాధించిన నేతగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మంచి ఆదరణ లభించింది.
This post was last modified on June 29, 2025 3:38 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…