Political News

ఎమ‌ర్జెన్సీకి.. మోడీకి సంబంధ‌మేంటి?.. తెలుసా?

దేశంలో 1975, జూన్ 25 అర్ధ‌రాత్రి ఎమ‌ర్జెన్సీ విధించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కులపై స‌ర్కా రు ఉక్కుపాదం మోపింది. అనేక మంది నాయ‌కుల‌ను అరెస్టు చేసి జైళ్ల‌లో కూడా పెట్టారు. చిత్రం ఏం టంటే.. ఆనాటి ప్ర‌ధాని ఇందిర.. త‌న సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారిని కూడా జైలుకు పంపించింది. త‌న‌ను వ్య‌తిరేకించిన వారు, ఎమ‌ర్జెన్సీని త‌ప్పుబ‌ట్టిన వారు.. ఎంత‌టి వారైనా స‌రే.. జైల్లో మ‌గ్గాల్సిందే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇలా.. అనేక అకృత్యాలు సాగాయి.

అయితే.. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ ఆ నాటి ఎమ‌ర్జెన్సీని సంవిధాన్ హ‌త్యాదివ‌స్‌గా పేర్కొన్నారు. అంటే.. ప్ర‌జాస్వామ్య హ‌త్యా దినంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. తాను కూడా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాన‌ని.. జైల్లో కూడా పెట్టార‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే దీనిపై పుస్త‌కాన్ని వెలువ‌రించ‌నున్న‌ట్టు కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌, దీనికి కొంత రాజ‌కీయ రంగు ఎలానూ పులుమి.. బీజేపీ సానుకూల‌, కాంగ్రెస్ వ్య‌తిరేక‌త పెరిగేలా వార్షికోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఇదిలావుంటే.. అస‌లు మోడీకి, ఎమ‌ర్జెన్సీకి సంబంధం ఏంటి? అనేది కీల‌కం. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించే స‌మ‌యానికి మోడీ వ‌య‌సు 23-24 సంవ‌త్స‌రాలు. ఆయ‌న అప్ప‌టికే ఆర్ ఎస్ ఎస్ జ‌న్ సంఘ్ లో స‌భ్యుడు. అంతేకాదు.. గుజ‌రాత్‌లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆర్ ఎస్ ఎస్ చేసిన ఉద్య‌మాల్లో విద్యార్థి నాయ‌కుడిగా కీల‌క పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోయింది. ఆ త‌ర్వాతే ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింది. దీనికి కూడా వ్య‌తిరేకంగా ఆర్ ఎస్ ఎస్ విద్యార్థి సంఘం ఏబీవీపీ క‌దం తొక్కింది.

దీనిలో గుజ‌రాత్ విభాగానికి మోడీ కీల‌క నాయ‌కుడిగా పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేసి జైల్లో కుక్కారు. అయితే.. ఇది సాధార‌ణంగా జ‌ర‌గ‌లేదు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలోనూ.. మోడీ స‌హా అనేక మంది నాయ‌కులు.. మారు వేషాల్లో రాష్ట్రంలో తిరిగి.. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు సాగించారు. వీటిపై తీవ్ర నిఘా పెట్టిన ఇందిర‌మ్మ స‌ర్కారు.. సిక్కు వేషంలో ఉన్న మోడీని అహ్మ‌దాబాద్ స‌మీపంలో అరెస్టు చేసిజైల్లో పెట్టారు. ఇదీ.. ఎమ‌ర్జెన్సీకి, మోడీకి ఉన్న సంబంధం.

This post was last modified on June 25, 2025 11:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago