యువ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రాపాలి ఎట్టకేలకు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఏపీ కేడర్ కు అమ్రపాలిని కేంద్రం కేటాయించగా… ఏపీకి వెళ్లేందుకు ఆమె ససేమిరా అన్నారు. దాదాపుగా పదేళ్ల పాటు ఆమె కోర్టుల్లో పోరాటం చేస్తూ ఈ పదేళ్ల పాటు ఏపీ కేడర్ కు కేటాయించినా… ఆమె తెలంగాణ కేడర్ లోనే పని చేశారు. ఇటీవలే మరో ఇద్దరు ఐఏఎస్ లతో కలిసి ఏపీకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లారు. తాజాగా క్యాట్ అమ్రపాలికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి ఆమె ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోనున్నారు.
వాస్తవానికి అమ్రపాలి స్వస్థలం ఏపీనే. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమె ఫ్యామిలీ చాలా కాలం క్రితం విశాఖకు మారిపోయింది. ఐఏఎస్ కు ఎంపిక అయిన సమయంలోనూ ఆమె ఫ్యామిలీ విశాఖలోనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఏపీ కేడర్ నే ఎంచుకున్నారు. ఆమె ఎంపిక మేరకే డీఓపీటీ ఆమెను ఏపీకి కేటాయించింది. అయితే చాలా మంది సివిల్ సర్వీసెస్ అధికారుల మాదిరే అమ్రపాలి కూడా రాష్ట్ర విభజనను ఊహించలేదు. అప్పటికే తెలంగాణ వాతావరణానికి అలవాటు పడ్డ అమ్రపాలి తాను తెలంగాణలోనే ఉంటానని డీఓపీటీకి ఆప్షన్ ఇచ్చింది.
అయితే మెజారిటీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణకే ఆప్షన్ ఇవ్వగా… ఏపీకి ఆప్షన్ ఇచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలో అమ్రపాలి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినా… ఆమెను డీఓపీటీ మాత్రం ఏపీకి కేటాయించింది. ఇలాగే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లను వారి ఆప్షన్ లకు విరుద్ధంగా ఏపీకి కేటాయించింది. డీఓపీటీ నిర్ణయాన్నిచాలా మంది అంగీకరిస్తే…అమ్రపాలి లాంటి వాళ్లు మాత్రం న్యాయపోరాటం మొదలుపెట్టారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) ఆశ్రయించారు.
క్యాట్ నుంచి తుది తీర్పు వచ్చేలోగానే ఇటీవలే అమ్రపాలితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ లు ఏపీ కేడర్ కు వెళ్లి తీరాల్సిందేనని డీఓపీటీ ఒకింత గట్టిగానే చెప్పింది. అంతేకాకుండా తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీ కేడర్ లో జాయిన్ అయ్యేందుకు వారికి ఓ గడువును కూడా నిర్దేశించింది. దీంతో చేసేది లేక అమ్రపాలి సహా ముగ్గురు ఏపీ కేడర్ కు వెళ్లారు. ఏపీకి వెళ్లినంతనే అమ్రపాలికి టూరిజం కార్యదర్శిగా మంచి పోస్టే దక్కింది. అయితే తాజాగా మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ అమ్రపాలిని తెలంగాణ కేడర్ కే కేటాయించింది. దీంతో త్వరలోనే ఆమె ఏపీ కేడర్ నుంచి తెలంగాణ కేడర్ కు మారనున్నారు.
This post was last modified on June 24, 2025 11:15 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…