Political News

వైసీపీలో డెత్ బెల్స్ మోగించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కీలకమైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ఐక్యత పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత కూడా కూటమి బలంగా ఉందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు, అంతేకాదు ఎక్కడ ఒడిదుడుకులు లేవని ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా చంద్రబాబు చెప్పారు, భవిష్యత్తులోనూ తమ కోటమి కొనసాగుతుందని తెలిపారు.

ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెబుతూ.. మరింత గట్టిగా కూటమి ఐక్యతను చాటారు. అంతేకాదు వైసీపీని నేరుగా ఆయన టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదు అని బల్లగుద్ది మరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోను కూటమి బలంగా ముందుకు వెళుతుందని, వైసీపీకి అధికారం కలలేనని స్పష్టం చేశారు. తామంతా కలివిడిగా ఉన్నామని, ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవని రావని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు వైసీపీలో తీవ్ర ప్రకంపనలే సృష్టించాయి.

ఎందుకంటే గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలవకూడదని, కలవరాదని వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబును పవన్‌ను దూరం పెట్టేందుకు ఇటు సోషల్ మీడియా అటు బహిరంగ వేదికలపై కూడా ఇద్దరినీ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాలపరంగా కూడా కాపు నాయకులను కొందరిని రంగంలోకి దింపి రాజకీయాలు సాగించారు. అయినా గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలిశాయి. ఫలితంగా వైసిపి 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్న ఓడిపోయింది.

ఈ పరిస్థితుల్లో కూటమిలో బేదాభిప్రాయాలు ఏర్పడి, కూటమి విచ్ఛిన్నమైతే తప్ప తమకు అవకాశం లేదని వైసిపి గత ఎన్నికల సమయంలోనే గ్రహించింది, అందుకే తరచుగా ఇటు జనసేనలో కానీ అటు టిడిపిలో కానీ మరోవైపు బిజెపిలో కానీ వ్యక్తిగతంగా నాయకులు ఎవరైనా చిన్న మాట అన్నా దానిని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. ఇటీవల ఒక బీజేపీ నాయకుడి పై జనసేన నాయకుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని వైసిపి మీడియా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది.

ఇలా మూడు పార్టీల మధ్య ఏదో ఒకచోట విభేదాలు రావడం ఖాయమని అది తమ లాభిస్తుందని వైసిపి అంచనా వేసింది. కానీ తాజా పరిణామాలతో తామంతా కలిసే ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి అధికారం దక్కనివ్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తరువాత వైసిపి ఒకరకంగా దిగాలు పడిందని చెప్పాలి. అయితే బిజెపితో ఉన్న సత్సంబంధాల కారణంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా వ్యూహం మార్చుకుని అడుగులు వేస్తే అప్పుడు మాత్రం వైసీపీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on June 24, 2025 12:36 pm

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

11 minutes ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

23 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

8 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago