ఇంకో నాలుగు రోజుల్లో కన్నప్ప విడుదల కానుంది. మంచు విష్ణు ఎడతెరిపి లేకుండా చేసిన ప్రమోషన్లు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయాయి. ఇంటర్వ్యూలు ఎన్ని ఇచ్చాడో లెక్క బెట్టడం కష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు దీని గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నారు. క్యామియో అయినా సరే అరగంట దాకా ప్రభాస్ ఉంటాడని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మద్దతు బలంగా దొరికనుంది. సాధారణంగా ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న మూవీకి ఎలాంటి పబ్లిసిటీ చేయకపోయినా హైప్ వచ్చేస్తుంది. కానీ విష్ణు మెయిన్ లీడ్ కావడంతో దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా జనాలకు రీచయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కన్నప్పకు అంత తేలిగ్గా స్వాగతం దొరకదు. కొన్ని సవాళ్లు ముందున్నాయి. 3 గంటల 15 నిమిషాల నిడివి అనే వార్త నిజమైతే కనక అంత సేపు ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ సినిమాలో ఉందనే టాక్ బయటికి రావాలి. పైగా ఓవర్సీస్ లో టికెట్ ధర 24 డాలర్ల దాకా పెట్టారనే టాక్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుబేర తరహాలో తెలంగాణలో గరిష్ట ధరలు తీసుకుని ఏపిలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు వాడుకునే ఆలోచనలో విష్ణు ఉన్నట్టు తెలిసింది. అదే జరిగితే అంత ధరకు న్యాయం చేసే అతి పెద్ద బాధ్యత ప్రభాస్ కన్నా ఎక్కువ విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీద ఉంటుంది.
పాటలు బాగానే రీచ్ అయినప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో స్పందన పెరగాల్సి ఉంది. రిలీజయ్యాక ఇది జరుగుతుందని టీమ్ నమ్మకం. పోరాట దృశ్యాలు, గొప్ప సన్నివేశాలు, అద్భుతమైన క్లైమాక్స్, సరిపడా ఎమోషన్స్, భక్తి అంశాలు, ప్రభాస్ అక్షయ్ కుమార్ పాత్రలు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయని వార్తలైతే చాలానే తిరుగుతున్నాయి. అయితే విపరీతమైన బజ్ తెచ్చేందుకు ఈ లీక్స్ సరిపోవడం లేదు. సో జూన్ 27 మార్నింగ్ షో అయ్యే దాకా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఊహించనంత బడ్జెట్ ఇప్పటికే ఖర్చు పెట్టేసిన మంచు విష్ణు కన్నప్ప కోసం కెరీర్ నే పణంగా పెట్టాడు. దానికి తగ్గ ఫలితమే రావాలి.
This post was last modified on June 24, 2025 11:42 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…