Political News

మేం పోల‌వ‌రం ఆప‌లేక‌పోయాం: క‌విత

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ప్రెస్‌క్ల‌బ్‌లో తాజాగా క‌విత రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడు తూ.. త‌మ హ‌యాంలోనూ త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌ని పోరాటం చేశామ‌న్నారు.

అయితే.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పోల‌వ‌రం ఆపివేయ‌లేక పోయామ‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ప్పుడే.. తాము వ్య‌తిరేకించామ‌న్నారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించామ‌న్నారు. కానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుద‌ల చేయ‌లేక పోతున్నారు. పైగా మోడీ స‌ర్కారు పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నా అని క‌విత అన్నారు.

తెలంగాణ‌కు చెందిన ఏడు మండ‌లాల‌ను ఏపీ అన్యాయంగా తీసుకుంద‌ని క‌విత అన్నారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం చేకూరింద‌ని చెప్పారు. వీటితోపాటు లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా అప్పగించా రని అన్నారు. ఈ విష‌యంపైనా తాను ఎంపీగా పోరాటం చేశాన‌న్నారు.కానీ, త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోంది అని క‌విత వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో త‌మ నుంచి గుంజుకున్న ఏడు మండ‌లాల్లో ఐదు మండ‌లాల‌ను తిరిగి తెలంగాణ‌కు అప్ప గించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపా డుల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించాల్సిందేన‌ని కోరారు. బ‌న‌క‌చ‌ర్ల‌ను తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు క‌విత చెప్పారు.

This post was last modified on June 22, 2025 5:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kavitha

Recent Posts

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

2 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

6 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

11 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

12 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

12 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

13 hours ago