వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. జగన్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు చాలామందిని భయపెట్టాయి. అందుకే మొన్నటి ఎన్నికలలో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసిపి అదే మోడల్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత రెండు పర్యటనలు చూస్తే వైసిపి ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుందా ? లేదా మరింత దూరం అవుతోందా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. ఇదే సీన్ రాబోయే రోజులలోను కొనసాగితే ఆ పార్టీకి రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని మాటలు వైసిపి నాయకులు నుంచే వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపాలి.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంది. అయితే జగన్ వైసీపీ గత కొంతకాలంగా చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం తెనాలిలో నేరచరిత్ర ఉన్నవాళ్లను పరామర్శించడానికి వెళ్లి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ వర్గాలను పక్కన పెడితే.. న్యూట్రల్ జనాలలో ఈ విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్ల సందర్శన కూడా కొత్త వివాదానికి తెరతీసింది. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కేడర్ బహిరంగంగా ప్రదర్శించిన ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
‘2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని. రాజారెడ్డి రాజ్యాంగం అమలు పల్నాడు నుంచే మొదలు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం… అన్న వస్తాడు అంతు చూస్తాడు ఇలాంటి నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవే కాదు ఇంకొన్ని బూతులతో కూడిన నినాదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపాలి అనుకుంటున్నారో అర్థం కావడంలేదని తలలు పట్టుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్ళ గోడు వర్ణనాతీతం.. అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలతో పాటు చాలామందికి భయం చూపించారని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మనసులు గెలుచుకోవాల్సింది పోయి.. ప్రతి పర్యటనలోనూ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వేసుకొంటున్నారని వాపోతున్నారు.
ఇలా చేయడం తప్పు అని… ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా విమర్శలు చేయడంతో పాటు ప్రజల మనసులు గెలిచేలా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీలో ఎవరు జగన్‌కు చెప్పే సాహసం కూడా చేయలేకపోతున్నారట. జగన్ పర్యటనలకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా తాజా పర్యటనపై పలు అంశాలు పెట్టింది.. పోలీసుల ఆంక్షలు కాదని పెద్ద ఎత్తున జనాలు జగన్ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఇలాంటి కాంట్రవర్సీ ప్రచారంతో మొత్తం వ్యవహారం పక్కకు పోయిందని వైసిపి వాళ్ళే వాపోతున్నారు.
This post was last modified on June 22, 2025 5:15 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…