Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
ఉచితంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా మనసు పెట్టవు. ఉదాహరణకు రేషన్ బియ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. ఎలాంటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం, వాటి తూకం ఎలా ఉంది అనేవి కూడా ప్రత్యేకంగా పట్టించుకోవు. కానీ మారుతున్న ప్రజల ఆలోచనలు, మారుతున్న ప్రజల అంచనాలు ప్రభుత్వాలను చైతన్య దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచితంగా ఇచ్చే పథకాలకు కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చేతిలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతుంది.
ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మంచి చేస్తే ప్రశంస కూడా దక్కుతుంది. అది ఓటుగా మారుతుంది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ పంపిణీ విషయంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీనిని సరి చేసేందుకు ఉచితంగానే ఇస్తున్నప్పటికీ వీటిని నాణ్యంగా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇక నుంచి బియ్యాన్ని నేరుగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు చొప్పున బస్తాల రూపంలోనే ఇవ్వనున్నారు. తద్వారా నాణ్యమైన బియ్యమే ప్రజలకు అందనున్నాయి. అదేవిధంగా ఇతర నిత్యావసర సరుకులను కూడా ఇదే పద్ధతిలో నాణ్యతను పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు.
ఇది ఒక రకంగా మంచి పరిణామం. అదేవిధంగా, ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు. ఏదో డొక్కు బస్సులు పెట్టేసి మమ అనిపించుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న భావనతో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన చూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి.
దీనిని కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం వారికి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తోంది. దాదాపు 350 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. తద్వారా ఉచిత పథకమే అయినా “చేతులు దులుపుకోలేదు” అనే సంతృప్తి ప్రజల్లో కలిగేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తీరు సంతోషించాల్సిన విషయం. ఇదే జరిగితే… ఉచిత బస్సు, అందునా కొత్త బస్సులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకు, కూటమి సర్కారుకే దక్కనుంది.
This post was last modified on June 22, 2025 5:17 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…