Political News

ఆర్.కృష్ణయ్యతో కవిత భేటీ… మ్యాటరేంటి?

తెలంగాణ రాజకీయాల్లో సెలవు దినం ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న ఆర్.కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. విద్యానగర్ లోని కృష్ణయ్య ఇంటికి నేరుగా వెళ్లిన కవిత ఆయనతో గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అయితే కేవలం బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ భేటీ జరిగిందని భేటీ తర్వాత ఇరువురు నేతలు ప్రకటించారు.

కృష్ణయ్యకు బీసీ వర్గాల్లో మంచి పేరుంది. బీసీల్లోని దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన వెంట నడుస్తు న్నాయి. బీసీల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టిన నేపథ్యమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. అలాంటి కృష్ణయ్యను మచ్చిక చేసుకుంటే… సమాజంలో అన్ని వర్గాల కంటే అత్యధిక జనాభా ఉన్న బీసీల ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవచ్చన్నది తెలుగు నేలకు చెందిన రాజకీయ పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే కృష్ణయ్య అడక్కుండానే వైసీపీ అదినేత జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్ ఓడాక వైసీపీని వీడిన కృష్ణయ్య నేరుగా బీజేపీలో చేరి తన రాజ్యసభ సీటును తానే దక్కించుకోగలిగారు.

ఇప్పుడు కవిత వ్యూహం ఏమిటన్న విషయానికి వస్తే… అన్న కేటీఆర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న కవిత సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. ఇందుకు తెలంగాణ జాగృతినే ఆయుధంగా చేసుకోవాలని చూస్తున్నారు. అయితే జాగృతికి పెద్దగా కార్యకర్తల బలం లేదు. ఇక కేసీఆర్ కు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు కూడా బీఆర్ఎస్ నుంచి మద్దతు లభించలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన కవిత… బీసీ కార్డును పట్టుకుని బయలుదేరినట్లు సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడదామంటూ ఎవరు వచ్చినా కృష్ణయ్య తప్పనిసరిగా మద్దతు పలుకుతారు. అందులో సందేహమే లేదు. ఇదే అంచనాతో బయలుదేరిన కవిత ప్లాన్ కూడా వర్కవుట్ అయినట్టే 

కనిపిస్తోంది.

బీసీల రిజర్వేషన్లకు మద్దతు పలికిన కవిత… జాగృతి తరఫున జూలై 17న చేపట్టనున్న రైల్ రోకోకు తప్పరిసరిగా మద్దతు తెలుపుతామంటూ కృష్ణయ్య నుంచి హామీ తీసుకోగలిగారు. అంతేకాకుండా భవిష్యత్తులో జాగృతి తరఫున చేపట్టే కార్యక్రమాలకు కూడా బీసీల నుంచి మద్దతు ఉంటుందన్న మాటను కూడా ఆమె కృష్ణయ్య నుంచి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… బీజేపీతో సంధి, ఆ పార్టీలో చేరిక, లేదంటే పొత్తుకు కృష్ణయ్య ద్వారా కవిత రాయబారం నెరపుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి గానీ… కృష్ణయ్యకు బీజేపీ నేతలతో అంతగా అవినాభావ సంబంధాలు లేని నేపథ్యంలో ఈ ఊహాగానాలను విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా జాగృతి బలోపేతం కోసమైతే బీసీల నుంచి మద్దతు కోసం కవిత చేసిన ప్రయత్నం అయితే ఫలించిందనే చెప్పక తప్పదు.

This post was last modified on June 22, 2025 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

23 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago