మంత్రి నారా లోకేష్- ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య బాండింగ్ మరింత పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట అమరావతిలో జరిగిన పున ప్రారంభ పనుల ఘట్టంలోనూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నారా లోకేష్ ను కొనియాడారు. ఒకసారి తన వద్దకు రావాలని ఆతిధ్యం స్వీకరించాలని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత నారా లోకేష్ కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లడం తాను చేసిన యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని కానుకగా మోడీకి అందించడం తెలిసిందే.
వాస్తవానికి నారా లోకేష్ వయసుతో పోల్చుకుంటే మోడీ 70 ఏళ్ల దాటిన నాయకుడు. అయినా ఇంత చనువుగా ఉండడం ఆసక్తికర విషయం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమాలను మోడీ నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి. నారా లోకేష్ కృషి పట్టుదల కలిగిన యువ నాయకుడిగా అభివర్ణించారు. అయితే అటు అమరావతిలోనూ ఇటు విశాఖపట్నంలోనూ మోడీ చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ సీరియస్ గానే తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆయన మరింతగా కష్టపడేందుకు అవకాశం కూడా ఉంది.
ఇదిలా ఉంటే అసలు ఏమాత్రం వ్యూహం లేకుండానే ప్రధాని మోడీ.. నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక బలమైన యువశక్తిని ప్రోత్సహించాలనేది మోడీ గత కొన్నాళ్లుగా ఆలోచన చేస్తున్న విషయం. 2029 నాటికి దేశవ్యాప్తంగా యువతకు సంబంధించిన ఓటు బ్యాంకు పెరుగుతోంది. యువ నాయకులను ప్రోత్సహించాలని మోడీ కొన్నాళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బిజెపితో అనుబంధం ఉన్న పార్టీలకు సంబంధించిన యువ నాయకులు ఆయన తరచుగా ప్రోత్సహిస్తున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో నారా లోకేష్ ను ఆయన ప్రోత్సహిస్తున్నారనేది పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తులు ఎదగకుండా రాజకీయంగా నారా లోకేష్ బలోపేతం అయితే అది తమకు కూడా మేలు చేస్తుంది అనేది మోడీ భావనగా ఉందని పరిశీలకులు అంటున్నారు. దీనిని ఎలా మలుచుకుంటారు, తనంతట తాను ఎలా మరింత మెరుగులు దిద్దుకుంటారు అనేది నారా లోకేష్ చేతిలోనే ఉంది. మోడీ ఆదరించిన నాయకుల్లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువనాయకుడు, జార్ఖండ్ కు చెందిన యువ నాయకులు చాలా మందే ఉన్నారు. ఈ పరంపరలో ఇప్పుడు లోకేష్ కూడా చేరుతుండడం గమనార్హం.
This post was last modified on June 22, 2025 5:01 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…