విపక్ష నేత అంటే… ప్రభుత్వం చేస్తున్న పనులపై నిత్యం నిఘా ఉంచుతూ అందులోని తప్పొప్పులను చెబుతూ సాగాలి. ఈ తరహా విపక్ష నేతలు ఇప్పుడు లేరనే చెప్పాలి. ప్రభుత్వం ఏ పని చేసినా దానిని భూతద్దంలో చూసి మరీ లేని తప్పులను పట్టేసి మరీ విమర్శలు గుప్పించే విపక్ష నేతలే ఇప్పుడున్నారు. ప్రత్యేకించి ఏపీలో ఈ తరహా మరీ పెరిగిపోయిందని చెప్పాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించిన కూటమి సర్కారుపై విపక్ష నేత జగన్ విమర్శలు గుప్పించారు. అయితే ఆ వెంటనే జగన్ కు చంద్రబాబు నుంచి అదిరేటి కౌంటర్ పడిపోయింది.
యోగా దినోత్సవం పేరిట ప్రజా సొమ్మును కూటమి సర్కారు నీళ్లలా ఖర్చు చేసిందని జగన్ ఆరోపించారు. ఇంత దుబారా అవసరమా? అని కూడా ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. యోగా డే కోసం కేవలం 2 గంటల కార్యక్రమం కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తారా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుబారా జనం నెత్తినే పడుతుంది కదా అని కూడా ఆయన ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మొత్తంగా యోగా డేను ఇంత భారీ ఎత్తున, ఇంత ప్రజా ధనం వెచ్చించి నిర్వహించాల్సిన అవసరం ఉందా? అంటూ జగన్ కూటమి సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ విమర్శలపై చంద్రబాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండానే ఎదురు దాడికి దిగారు.
యోగా డే జరిగిన తీరు, అందివచ్చిన రికార్డులు, జనం స్పందన, అంతిమంగా ప్రధాని ఏ రీతిన స్పందించారన్న వివరాలను చెప్పేందుకు చంద్రబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ విమర్శల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినా జగన్ హయాంలో జరిగినట్లుగా ఇప్పుడు ప్రజా ధనం వృథా కావడం లేదు కదా అంటూ చంద్రబాబు సెటైర్లు సంధించారు. ఇందుకోసం ఆయన రుషికొండపై జగన్ నిర్మించిన భవంతులను ఉదహరించారు.
ఆ తర్వాత ఎవరెవరో ఏదో మాట్లాడితే వాటన్నింటిపై సమాధానాలు చెప్పుకుంటూ పోతే కుదరదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే యాపిల్ ను యాపిల్ తోనే పోలుస్తాం గానీ…యాపిల్ ను ఉల్లిగడ్డతో పోలుస్తామా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు. ఈ లెక్కన జగన్ ను ఆయన ఏకంగా ఉల్లిగడ్డతో పోల్చేశారని చెప్పాలి. దేనినైనా దాని విలువకు సరిపడే వస్తువుతోనే పోలుస్తామన్న బాబు… దానికంటే తక్కువ విలువ కలిగిన దానితో పోల్చలేమని అన్నారు. బాబు నోట నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించగానే… అప్పుడెప్పుడో ఆలుగడ్డ, ఉర్లగడ్డ, ఉల్లిగడ్డ అంటూ ఏవేవో పదాలను పలికి అడ్డంగా బుక్కైన జగన్ వ్యాఖ్యలు ఇట్టే గుర్తుకు వచ్చాయి.
This post was last modified on June 21, 2025 4:12 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…