Political News

కస్టడీకి కృష్ణంరాజు, పోలీసులకు కోర్టు కండిషన్

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు శుక్ర‌వారం త‌మ అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌గిరి కోర్టు గురువారం రాత్రి మూడు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీకి ఆయ‌న‌ను అనుమ‌తించింది. దీంతో శుక్ర‌వారం గుంటూరు జైలుకు వెళ్లిన పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే.. పోలీసుల క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని కృష్ణంరాజు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. దీనికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది.

శుక్ర‌వారం నుంచి మూడు రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును ప్ర‌శ్నించ‌నున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని వేశ్య‌ల రాజ‌ధానితో పోల్చుతూ.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై పోలీసులు కూపీ లాగ‌నున్నారు. ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జ‌రిగిన డిబేట్‌లో కృష్ణంరాజు ఈ వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌రం.. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన వారిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఎట్ట‌కేల‌కు ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును పోలీసులు శ్రీకాకుళంలో అరెస్టు చేసి తీసుకువ‌చ్చారు. అనంత‌రం కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. ఈ వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రు ఉన్నారు?  ఎవ‌రి ప్రోద్బ‌లంతో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు?  రాజ‌ధానిపై కుట్ర‌లు ఎవ‌రు ప‌న్నారు? అనే కీల‌క విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఆయ‌న‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని తుళ్లూరు పోలీసులు కోర్టును అభ్య‌ర్థించ‌డంతో అనుమ‌తిఇచ్చింది. అయితే.. విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న‌పై చేయి చేసుకోవ‌ద్ద‌ని సూచించింది.

This post was last modified on June 21, 2025 6:46 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

33 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago