ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన ఎంతో ఆసక్తి కనబరిచి.. ఆహ్వానించిన ప్రతిష్టాత్మక సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్.. త్వరలోనే ఏపీకి రానుంది. ఈ మేరకు తాజాగా తన సమ్మతిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్‌కు సమాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూసన్స్ అనేది అమెరికాకు చెందిన కీలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎకరాకు రూ.0.99 కే కేటాయించారు.
ఈ ప్రతిపాదనల తర్వాత.. స్థానికంగా విచారణ చేసుకున్న సంస్థ.. తాజాగా ఏపీకి వచ్చేందుకు సమ్మతించింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. తొలి దశలో 1,582 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరిన్ని రెట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుండడంతో విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు పాకనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
This post was last modified on June 20, 2025 11:01 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…