ఏపీలోని కూటమి ప్రభుత్వం గత ఏడాది ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ.. సూపర్ 6 హామీల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధానంగా ప్రకటించింది. తాజాగా కొన్ని రోజుల కిందట.. సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని చేరువ చేస్తున్నట్టు చెప్పారు. నెలకు సుమారు 30 కోట్ల రూపాయల వరకు.. సర్కారుపై భారం పడుతుందన్నారు.
అయినప్పటికీ మహిళామణులకు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామని చంద్రబాబు తెలిపారు. అయితే.. ఉచిత బస్సే కదా.. అని సీఎం చంద్రబాబు మహిళలకు కేటాయించే బస్సులపై చిన్న చూపు చూడలేదు. రాష్ట్రంలో అమలయ్యే ఉచిత బస్సు పథకం కోసం.. నేరుగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా.. ఎలక్ట్రిక్ బస్సులే కావడం గమనార్హం. అంటే.. ఆ బస్సులు ఎక్కిన వారికి ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. కనీసం.. బస్సు వెళ్తోందా? అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సుల ఇంజన్లు పెద్దగా శబ్దం చేయవు. పైగా సౌకర్యాలు కూడా మరిన్ని ఎక్కువగా ఉంటాయి.
తాజాగా `పీఎం-ఈ-బస్ సేవ` పథకం కింద కేంద్రం సమకూర్చే ఎలక్ట్రిక్ బస్సులను కొనాలని సీఎం చంద్రబాబు రవాణా శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఏపీకి రానున్నాయి. ఈ బస్సులను ఎందుకు కొనుగోలు చేస్తున్నదీ.. ప్రతిపాదనలు రూపొందించేందుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికను 15 రోజుల్లోనే ఇవ్వనుంది. పథకాన్ని ప్రారంభించేందుకు మరో 50 రోజుల సమయం ఉంది. సో.. అప్పటిలోగానే కేంద్రం నుంచి కొత్త బస్సులు తీసుకువచ్చి.. మహిళలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారు. వీటిని కేంద్రం రాయితీపై రాష్ట్రాలకు అందిస్తున్న విషయం తెలిసిందే.
This post was last modified on June 20, 2025 10:06 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…