Political News

టీడీపీ ఎమ్మెల్యే `ఏలూరి` రాజ‌కీయాలకు ఇది బిగ్ టెస్ట్‌… !

ఆయన ఎంతో సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే. అన్యాయాలు అక్రమాలకు కడు దూరంలో ఉండే శాసనసభ్యుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రజా ప్రతినిధి. ఆయనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరి నియోజకవర్గ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరి సాంబశివరావు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రజలకు చేరువ అయినవారు ఎంతమంది ఉన్నారు అని లెక్క వేసుకుంటే చాలా చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. అట్లాంటి వాళ్ళలో మొట్టమొదటి ఉండే నాయకుడు ఏలూరి సాంబశివరావు.

పేదల పాలిట పెన్నిధిగా రైతులకు ఆపద బంధువుగా వ్యవహరించే ఏలూరు సాంబశివరావుకు ఇప్పుడు కీలక సమస్య వెంటాడుతుంది. సమస్య చిన్నదే కానీ ఇబ్బందులు మాత్రం పెద్దవిగా ఉన్నాయి. ఇది కూడా రైతులకు సంబంధించిన విషయమే కావడంతో ఆయన తర్జనభజన పడుతున్నారు. పదేపదే వ్యవసాయ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మా సమస్యను పట్టించుకోండి మా రైతులను ఆదుకోండి అంటూ ఆయన విన్నవిస్తున్నారు. నిజానికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇలా పదేపదే వ్యవసాయ శాఖ చుట్టూ తిరగడం విస్మయం కలిగించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

అయినప్పటికీ ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించాలన్న దృక్పథంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సమస్య ఏమిటంటే.. పరుచూరి నియోజకవర్గంలోని మెట్ట రైతులు పొగాకును విస్తారంగా పండించారు. దీనిలో నల్ల బర్లి పొగాకు కీలకం. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది. దీంతో గత ఏడాది రైతులు దీనిని ఎక్కువగా పండించారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ అనేక ఒడిదుడుకులకు లోనైంది. యుద్ధాలు, ద్రవయోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల కారణంగా మార్కెట్లో దెబ్బతిన్నాయి.

దీంతో పొగాకు కొనుగోలు చేసే అంతర్జాతీయ సంస్థలు దుకాణాలు మూసేశాయి. ఈ ప్రభావం స్థానికంగా ఉన్న రైతుల మీద తీవ్రంగా పడుతోంది. అయితే అప్పటికే వారు పండించేసి మార్కెట్లకు తరలించేశారు. దీంతో ఈ పొగాకును వెనక్కి తీసుకోలేక అలాగని కొనుగోలు చేయలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ పొదిలిలో పర్యటించి పొగాకు రైతుల విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ముందే ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పొగాకు రైతులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒకటికి నాలుగు సార్లు ఆయన వ్యవసాయ శాఖ చుట్టూ తిరిగి పొగాకును కొనుగోలు చేసేలాగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చారు.

అయినా అంతర్జాతీయ ప్రణామాల నేపథ్యంలో పొగాకును కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థలు ముందుకు రాకపోవడం రాష్ట్రం కూడా దానికి సిద్ధంగా లేనట్టే సంకేతాలు ఇచ్చాయి. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే ఏలూరి ఒకంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోదని త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు. నిత్యం ఆయన పరుచూరులోని మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించి ఏ రోజు ధర ఎంత అనేది తెలుసుకొని సాధ్యమైనంత ఎక్కువకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేలా ఏర్పాటులు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ఈ ఒక కారణంగా ఆయన ప్రభావం కానీ ఆయన పేరుగాని పోతుందని రైతుల్లో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పడానికి ఆస్కారం లేదు.

This post was last modified on June 21, 2025 6:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago