రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అధిపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరిదీ సూపర్ కాంబినేషన్ అని కూటమి నాయకులు కాదు జాతీయస్థాయిలో బిజెపి నాయకులు చెబుతున్న మాట, ప్రస్తుతం అంతర్జాతీయ యోగాను విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. దీనికి సంబంధించి కేంద్రంలోని మంత్రులు ఉత్తరాది నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ -ఏపీ సీఎం చంద్రబాబు `సూపర్ జోడి` అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. దీనికి యూపీ సీఎం యోగి ఆదిత్య చేసిన మరికొన్ని విషయాలను పరిశీలిస్తే అనేక పోలికలు కనిపిస్తున్నాయి. ఒకటి వయసు రిత్యా మోడీ చంద్రబాబు 70 ప్లస్ లో ఉన్నారు. అంతేకాదు ఇద్దరూ యాక్టివ్గా ఉన్నారు. దీన్ని యోగి ప్రస్తావించారు.. 70 ప్లస్ లో ఉండి కూడా ప్రధాని, ఏపీ సీఎం చాలా యాక్టివ్ గా ఉన్నారని ప్రజల మధ్యకు వెళ్తున్నారని, నిత్యం ప్రజల్లో ఉంటున్నారని ఆయన చేసిన కాంప్లిమెంటు ప్రస్తావనార్హం.
అదేవిధంగా వికసిత భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్న మోడీ.. అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఒకే పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇది కూడా ఇద్దరికీ మధ్య కాంబినేషన్ కుదరడానికి మంచి కీలక పరిణామం అనేది సీఎం యోగి చెప్పిన మాట. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవిస్ మరో కీలక విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఐటీరంగంపై మహా మోజు, పిచ్చి. రాష్ట్రాన్ని ఐటిలో పరుగులు పెట్టించాలని ఆయన లక్ష్యం.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దేవేంద్ర ఫణవిస్ ఐటీ లో ప్రధాని మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కీలకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు అటు ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా ఐటిని ప్రోత్సహిస్తుంటే సీఎం గా చంద్రబాబు ఏపీలో ఏకంగా ఐటీ రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐ యూనివర్సిటీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సారూప్యతలకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా సీఎం చంద్రబాబు దూరదృష్టిని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ తో పోల్చారు. ప్రధాని మోడీ ద్వారా దృష్టికి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నిదర్శనం అని పేర్కొన్న ఆయన అచ్చంగా అదే దూర దృష్టితో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా చాలామంది నాయకులు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు సూపర్ జోడి అంటూ పొగడ్తలతో కొనియాడడం విశేషం.
అయితే ఇక్కడ డౌట్ రావచ్చు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి ప్రధానిగా మోడీ ఈరోజు పాలించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యం కాబట్టే ఇలా వ్యాఖ్యానించారు ఏమో అని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఇది ఒక భాగం మాత్రమే. చంద్రబాబును వ్యక్తిగతంగా పరిశీలించినా ఆయన చేస్తున్న కృషిని ఏమాత్రం తక్కువ చేసి చూపలేం. కాబట్టి మోడీ చంద్రబాబు జోడి సూపర్ అనడంలో ఎవరికి సందేహం లేదు.
This post was last modified on June 20, 2025 7:57 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…