రాజకీయాల్లో స్నేహం చేయడం, చేతులు కలపడం, సహజంగా జరిగే కార్యక్రమం. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా నాయకులు చేతులు కలపడం గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. అయితే దీనికి భిన్నంగా 2019 -24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చట్టా పట్టాలు ఏసుకొని జగన్ తిరిగారనే మాట అందరికీ తెలిసిందే. ఇది ఎవరు కొట్టి వేయలేని విషయం. నిజానికి బిజెపి సిద్ధాంతాలు వేరు, వైసీపీ సిద్ధాంతాలు వేరు.
బిజెపి ఓటు బ్యాంకు వేరు. వైసీపీ ఓటు బ్యాంకు వేరు. దీంతో నేరుగా ఎక్కడా బిజెపితో పొత్తు పెట్టుకునేందు కు జగన్ సహసించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెరచాటున మాత్రమే జగన్ మోడీతో కలిశారు. ఆయనతో కలిసి ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోడీని మెప్పించారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో కలిసి ఉండడం విడిపోవడం రాజకీయంగా ముందుకు సాగడం సాగలేక పోవడం అనేవి పక్కన పెడితే కీలక నేతలను మెప్పించిన పార్టీలు, కీలక నేతలను ఒప్పించిన నాయకులు మాత్రమే ప్రజల్లో మన గలిగారు. మనగలుగుతున్నారు.
దీనికి ప్రధాన ఉదాహరణ చంద్రబాబు. ఒకప్పుడు బీజేపీతో కలిశారు. తర్వాత వదిలేశారు. మళ్లీ గత ఎన్నికలకు ముందు చేతులు కలిపారు. కానీ ఆ తర్వాత నుంచి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ప్రతి విషయంలోనూ మోడీని మెప్పించే కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నారు. యోగ విషయంలోనే కాదు ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ సింధు(ఇరాన్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చే కార్యక్రమం) వరకు అన్ని విషయాల్లోనూ మోడీని ఆకాశానికి ఎత్తేయడంతో పాటు మోడీ ఈ దేశ నాయకుడు.. ఈయన లేకపోతే దేశం అనేక ఇబ్బందులు పడుతుందన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా మోడీ మనసును చంద్రబాబు చూరగొన్నారని చెప్పాలి.
ఈ విషయంలో జగన్ చాలా చాలా వెనకబడిపోయారు. పైకి కలిసున్నామని భరోసా ఉండొచ్చు. కానీ అంతర్గతంగా మోడీ మనసును ఆయన తెలుసుకోలేకపోయారు. మోడీని కూడా మెప్పించలేకపోయారు. దీంతో రాజకీయంగా జగన్ -మోడీల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు అనుబంధాలు దాదాపు ఇప్పుడు తగ్గిపోయాయి అనేది జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణల ద్వారా స్పష్టం అవుతుంది. మరి భవిష్యత్తులో జగన్ మోడీతో ఎలా ప్రయాణం చేస్తారు, ఎలా కలిసి ఉంటారు అనేది చూడాలి. ఇప్పటికైతే జగన్ ప్లేస్ ను చంద్రబాబు డామినేట్ చేసేసారు అనేది జాతీయ మీడియా చెబుతున్న మాట.
This post was last modified on June 20, 2025 7:54 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…