ఢిల్లీ రాజకీయాలను గమనిస్తే టిడిపి యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఇప్పటివరకు అయినా 6 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. ఇది చిత్రం కాదు వాస్తవం. ఢిల్లీ పర్యటనలో మూడుసార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఒకసారి ప్రధానమంత్రిని కలిశారు. రెండుసార్లు పార్టీ ఎంపీలను కలిశారు. అలాగే సొంత పనుల మీద రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. మొత్తంగా అన్ని పర్యటనలలోనూ ఢిల్లీలో నారా లోకేష్ పాత్ర పెరుగుతోంది. ఇది ఎటువంటి సంకేతాలను ఇస్తోంది. అసలు నారా లోకేష్ ఢిల్లీకి గతంలో వెళ్లని నాయకుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ.
వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు మాత్రమే ఢిల్లీకి పదేపదే వెళ్లేవారు. అప్పట్లో బీజేపీతో కలిసి ఉండటం రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావడం కోసం ఆయన ఢిల్లీలో పర్యటించేవారు. ప్రధానిని కూడా కలిసేవారు. ఇతర పనులపై కూడా ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో గత ఏడాది ఏర్పడిన కూటమి ప్రభుత్వం తర్వాత నారా లోకేష్ కు ఢిల్లీలో ప్రధాన్యం పెరుగుతోంది.
కేంద్ర మంత్రులను పరిచయం చేసుకోవడం కేంద్రంలో రాజకీయ నాయకులతో ఆయన సత్సంబంధాలను పెంచుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో జాతీయ నాయకుడిగా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా కూడా టిడిపి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. టిడిపిలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మాత్రమే జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నా ఆ తర్వాత మరో నాయకుడు అంటూ లేకుండా పోయారు.
ఎర్రన్నాయుడు కొన్ని రోజులు పార్లమెంట్ లోను జాతీయ స్థాయిలోనూ టిడిపి తరఫున చక్రం తిప్పినా ఆయన తరువాత చంద్రబాబు నాయుడు ఆ స్థానం మరి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని తిరిగి మంత్రి నారా లోకేష్ కు అప్పగిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. పదేపదే వారితో చర్చిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై గళం వినిపిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా ఆయన ఇండివిడ్యువల్ గా కలుసుకున్నారు. ఫ్యామిలీతో సహా కలిసి తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని బహుమానంగా అందించారు.
This post was last modified on June 20, 2025 2:00 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…