ప్రెస్ మీట్…తెలుగులో విలేకరుల సమావేశం.. ఎంతసేపు జరుగుతుంది. ఓ అరగంట..ఇంకా కాస్త సరుకు ఉన్న సబ్జెక్ట్ అయితే 45 నిమిషాలు. అంతకుమించి సమయం పెరిగితే… ఆ మీడియా సమావేశానికి హాజరైన మీడియా ప్రతినిదులకు నిద్ర ముంచుకు వస్తుంది. అంతేకాదండోయ్… ఆ ప్రెస్ మీట్ నిర్వహించే ప్రధాన వక్త అనుచరులు కూడా ఇంకెంత సేపు స్వామీ అంటూ ఆ వక్త వైపు కొరకొరా చూస్తారు. గంటకు పైగా సాగే ప్రెస్ మీట్ అయితే… మీడియా ప్రతినిధులకు అదో పనిష్మెంట్ కిందే లెక్క. అలాంటిది దాదాపుగా 2 గంటల పాటుగా నాన్ స్టాప్ గా ప్రెస్ మీట్ సాగితే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం ఏకంగా 2 గంటల పాటు సాగింది. జగన్ ఎక్కడో మొదలుపెట్టి… మరెక్కడికో వెళ్లిపోయి… తిరిగి మొదలుపెట్టిన విషయం దగ్గరకు వచ్చేసరికి నిజంగానే 2 గంటల సమయం పట్టింది మరి. 11.30- 11.40 గంటల మద్య మీడియా సమావేశాన్ని మొదలుపెట్టిన జగన్.. దానిని నిరాఘాటంగా అలా కొనసాగించి ఎప్పుడో 1.45 గంటలకు ముగించారు. అప్పుడు కూడా ఇక మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాకపోవడంతో జగన్ దానిని ముగించారు. ఒకవేళ మీడియా ప్రతినిధులు ఇంకా ప్రశ్నలు సంధించి ఉండిఉంటే… ఈ మీట్ మరింతసేపు సాగేదే.
జగన్ తన మీడియా సమావేశాల్లో తాను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేదాకా మీడియా ప్రతినిధులను మారు మాట కూడా మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తారు. ఇది దాదాపుగా అందరు నేతలూ చేసేదే అయినా… జగన్ మాత్రం ఈ నిబంధనను మరింత పకడ్బందీగా పాటిస్తారు. తాను చెప్పాలనుకున్నది మొత్తం పూర్తి అయిన తర్వాత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అనుమతి ఇస్తారు. గురువారం కూడా అదే జరిగింది. జగన్ తన ప్రెస్ మీట్ ను వైసీపీ నేతల మీద కేసులు, తన పర్యటనల మీద ఆంక్షలతో మొదలుపెట్టి… ఆ తర్వాత రాష్ట్ర జీడీపీ, తాను చేసిన అప్పులు, ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పుల్లోకి వెళ్లిపోయి… తిరిగి రెంటపాళ్ల పర్యటనలోకి వచ్చి ఆగారు.
ఆ తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగగా… వాటికి లెంగ్తీ ఆన్సర్లు ఇస్తూ జగన్ సాగారు. సమయం ఎక్కువై పోతోంది అని ఎవరో అంటే… అరెరే ఏ విషయాన్ని అయినా కాస్తంత వివరంగా చెప్పాలి కదా అంటూ జగన్ సమయాన్ని పట్టించుకోకుండా అలా అలా సాగిపోయారు. ఇక పరిస్థితిని గమనించిన జర్నలిస్టులు ఇలాగైతే కాదని… ప్రశ్నలు అడగడం మానేశారు. దీంతో ఎప్పుడో 1.45 గంటలకు జగన్ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోగా… బతుకు జీవుడా అంటూ జర్నలిస్టులూ బయటపడ్డారు. ఈ ప్రెస్ మీట్ కు ఎలాగూ వైసీపీ అనుకూల మీడియా మాత్రమే హాజరై ఉంటుంది కాబట్టి సరిపోయింది గానీ… ఇతరత్రా మీడియా ప్రతినిధులు వెళ్లి ఉంటే మధ్యలోనే లేచి వెళ్లిపోయేవారేమో.
This post was last modified on June 20, 2025 1:54 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…