Political News

రేణిగుంట కాదు.. ‘శ్రీవేంక‌టేశ్వ‌ర’ విమానాశ్ర‌యం!

దేశ‌, విదేశాల నుంచి తిరుమ‌ల వ‌చ్చే భ‌క్తులు విమానాల‌ను ఆశ్ర‌యించే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తిరుప‌తికి వ‌చ్చే విమానాలు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి వ‌స్తున్నాయి. ఇదే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న విమానాశ్రయం. ఇక్క‌డ దిగి 15 కిలో మీట‌ర్ల దూరంలోని తిరుప‌తికి రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు. అయితే.. సుదీర్ఘ‌కాలంగా ఉన్న రేణిగుంట విమానాశ్ర‌యం పేరును తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు.. ‘శ్రీవేంక‌టేశ్వ‌ర విమానాశ్ర‌యం’గా మార్పు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర పౌర‌విమానయాన శాఖ‌కు పంపనుంది.

ఈ మేర‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ అయిన పాలక మండలి తీర్మానం చేసింది. తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా నామకరణం చేసిన‌ట్టు నాయుడు చెప్పారు. ఈ తీర్మానాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉందని తెలిపారు. త్వరలోనే ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలానే.. తిరుమ‌ల‌కు 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కూడా రానున్న‌ట్టు చెప్పారు.

కేంద్రమంత్రి, క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ సీఎం కుమార్ స్వామి ‘సెంట్రల్ ఫండ్’ ద్వారా ఈ 100 ఎలక్ట్రికల్ బస్సులు ఉచితంగా తిరుమ‌ల‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నార‌ని నాయుడు చెప్పారు. వాటిని తీసుకురావడానికి తీర్మానం చేశామన్నారు. సి ఎస్ ఐ ఆర్ ల్యాబ్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని త్వరలోనే ల్యాబ్ ఏర్పాటుకు స్థలాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. 1952లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల భవనాల పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మం వ్యాప్తి కోసం టిటిడి ధర్మ ప్రచార పరిషత్ కు ఏడాదికి 120 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

తిరుమ‌ల ఆధ్వ‌ర్యంలో న‌డిచే.. ‘శ్రీ వాణి ట్రస్ట్’ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడానికి తీర్మానం చేసిన‌ట్టు నాయుడు వివ‌రించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో 141 ఆలయాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించిన‌ట్టు చెప్పారు. టిటిడి కళాశాలలో ఏళ్ల తరబడి లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. అన్న ప్ర‌సాదాలు స‌హా.. ప‌విత్ర ల‌డ్డూ ప్రసాదాల‌ను కూడా నాణ్య‌తమేర‌కు త‌యారు చేయించి భ‌క్తుల‌కు అందిస్తున్నామ‌న్నారు.

This post was last modified on June 17, 2025 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

20 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

26 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

52 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago