Political News

తేడా వ‌స్తే త‌ప్పించుకుంటారా.. క‌మ‌ల నాథుల వ్యూహ‌మేంటో..!

రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో జరిగిన పాలనపై రాష్ట్ర ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ప్రధానంగా ప్రజలను కలుసుకోవడం ప్రజల సంతృప్తిని లెక్క వేసుకోవడం వారికి అనుకూలంగా మళ్లీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. అయితే కూటమి పార్టీలుగా విజయం దక్కించుకున్న వాటిలో బీజేపీ కీలకమైంది. కేంద్రంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ముఖ్యమైనది. ఇది అందరికీ తెలిసిందే.

ఇలాంటి సమయంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తున్న చంద్రబాబుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నటువంటి ఆలోచన బిజెపికి రాకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏడాదిపాలనపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నా.. బిజెపి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా తల్లికి వందనం వంటి పథకాన్ని అమలు చేసినప్పుడు కూడా దీనిపై ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. దీనివ‌ల్ల‌ అనేకమంది మహిళలకు లబ్ధి జరుగుతోందని ఒక ప్రెస్ మీట్ గాని ఒక ప్రకటన గాని విడుదల చేయలేదు.

అలాగే పింఛన్ల పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి వాటిపై కూటమీ పాలకులు ఒకవైపు ప్రకటనలు చేస్తున్న బిజెపి పక్షాన ఎవరు నోరు ఎత్తటం లేదు. మరి దీన్ని ఎలా చూడాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే రేపు ఏదైనా ప్రజల్లో అసంతృప్తి రగిలి అసంతృప్తి కారణంగా విమర్శలు చేస్తే మా తప్పులేదు అని తప్పించుకునే దారి బిజెపిలో కనిపిస్తోందా? లేకపోతే రేపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే దానికి మాకు సంబంధం లేదు మేము నిమిత్త మాత్రులం అని తప్పించుకునే దారి కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు.

కూటమి ప్రభుత్వంలో ఏం చేసినా అది మూడు పార్టీలకు వర్తిస్తుంది. రేపు ఓట్లు అడిగే విధానాన్ని పరిశీలిస్తే మూడు పార్టీల పరంగానే ప్రజల్లోకి వెళ్లాలి. మూడు పార్టీల పరంగానే ప్రజలను ఓట్లు అభ్యర్థించాలి. ఈ విషయంలో బిజెపి నాయకులు అనుసరిస్తున్న ధోరణి ప్రధానంగా చర్చగా మారింది. ఇది సరికాదని ప్రజల్లోకి రావాలనేది కూట‌మి పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో విజయం ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి ఈ ఐదేళ్ల పాలనను చూసి మాత్రమే ప్రజలు ఓటేస్తారు తప్ప జగన్ పై విమర్శలు చేయ‌డం ద్వారా ఓట్లు ఎంతవరకు పడతాయి అనేది చూడాలి.

కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్నా.. మళ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించాలన్నా కూడా అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా ప్రజల మధ్య ఉండడం ప్రజల సమస్యలు పట్టించుకోవడం ముఖ్యం. సంతృప్తిని కూడా అంచనా వేసుకోవడం వంటివి బిజెపి నాయకులు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట. మ‌రి క‌మ‌ల నాథులు ఏమంటారో చూడాలి.

This post was last modified on June 15, 2025 10:34 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

58 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago