Political News

‘త‌ల్లికి వంద‌నం’.. ఆనందంపై చంద్ర‌బాబు ఆరా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్షాన ఇచ్చిన ‘సూప‌ర్-6’ హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని గ‌త గురువారం ప్రారంభించారు. శుక్ర‌వారం, శ‌నివారాల్లో ల‌బ్ధిదారులైన మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జ‌మ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చ‌దువుకునే చిన్నారులు ఉన్నా.. వారంద‌రికీ ఈ సొమ్ములు జ‌మ చేస్తామ‌ని చెప్పిన‌ట్టుగానే.. ప్ర‌స్తుతం అదే ప‌నిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు.

కుటుంబంలో ముగ్గురు పిల్ల‌లున్నా..చివ‌ర‌కు అయిదుగురు పిల్ల‌లు ఉన్నా.. నిధులు ఇచ్చారు. స‌హ‌జంగా నే ఇంత పెద్ద కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం క్రెడిట్ కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు అదే ప‌నిచేశారు. ఆదివారం పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న ఫోన్ చేసి.. ప్ర‌జ‌ల సంతృప్తి ఎలా ఉంద‌న్న‌ది ఆరా తీశారు. మ‌హిళల‌ ఆనందాన్ని తెలుసుకున్నారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై ఆనందం ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించారు. మొత్తంగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్తితిని ఆయ‌న అడిగి విచారించారు.

ఈ సంద‌ర్భంగా ఎక్కువ మంది ఆనందం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. గ్రామీణ భార‌తంలో స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్ల పిల్ల‌ల‌కు ఈ ప‌థ‌కం చేర‌క‌పోవ‌డాన్ని త‌మ్ముళ్లు చంద్ర‌బాబు దృష్టికి తీసుకు వ‌చ్చారు. వైసీపీ హ‌యాంలో వారికి కూడా అందింద‌ని.. ఇప్పుడు వారిని త‌ప్పించార‌ని చెప్పారు. దీనిపై చంద్ర‌బాబు స‌రిచూస్తామ‌ని వారికి హామీ ఇచ్చారు. ఇక‌, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కూడా.. ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కుదించ‌డంపై త‌మ్ముళ్లు వివ‌రాలు స‌మ‌ర్పించారు.

300 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన వారిని ఈ ప‌థ‌కం నుంచి త‌ప్పించారు. అలాగే.. నాలుగు చ‌క్రాల వాహ‌నాలు ఉన్న‌వారిని కూడా తీసేశారు. ఈ విష‌యంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని.. వీరికి వేరే రూపం లో అయినా.. ప్ర‌భుత్వం సాయం అందించాల‌ని సూచించారు. పైగా.. తెల్ల‌రేష‌న్ కార్డును కొల‌మానంగా తీసుకున్నా.. వారిలో కూడా చాలా మందికి ఈ ప‌థ‌కం చేర‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌వైపు సంతృప్తి ఉంద‌ని చెబుతూనే.. మ‌రోవైపు.. లోపాల‌ను కూడా ఎత్తి చూపారు. ఈ ప‌రిణామాల‌పై చంద్రబాబు చ‌ర్చిస్తాన‌ని హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 15, 2025 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago