Political News

జ‌గ‌న్‌.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జ‌గ‌న్ గా రూ.. మీరు క‌డుపు మంట‌తో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి. క‌డుపు మంట త‌గ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన త‌ల్లికి వంద‌నంప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కంలో లోపాలు ఉన్నాయంటూ.. జ‌గ‌న్‌కు చెందిన మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌సారాల‌పై మంత్రి నారా లోకేష్ త‌న‌దైన రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు తీరు జ‌గ‌న్ క‌డుపు మంట‌ను మూడింత‌లు పెరిగేలా చేసింద‌న్నారు. అందుకే త‌న విష ప‌త్రిక‌లో న‌కిలీప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లులంద‌రికీ నిధులు అందాయ‌ని.. ఈవిష‌యం తెలిసి కూడా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. దొంగ‌లెక్క‌లు సృష్టించ‌డం.. పేద‌ల పేరుతో సొమ్ము కొట్టేయడం జ‌గ‌న్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.

“ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం. జ‌గ‌న్ ఈ విష‌యం మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నాడు. త‌న ప్ర‌భుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుంద‌ని ఆయ‌న అనుకుని ఉంటాడు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో త‌ప్పులు చేయం, ఎవ‌రినీ చేయ‌నివ్వం. త‌ల్లికి వంద‌నం స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్‌కుక‌డుపు మంట పెరిగింద‌ని అందుకే.. ఇలా త‌న మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ క‌డుపు మంట త‌గ్గించుకునేందుకు నేనే స్వ‌యం 2 ఈనో ప్యాకెట్ల‌ను పంపిస్తా.. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి.. కడుపు మంట కొంతైనా త‌గ్గుతుంది” అని నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

This post was last modified on June 15, 2025 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

3 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

5 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

5 hours ago

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…

5 hours ago

పైరసీని ఆపడానికి యాప్

సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…

6 hours ago

‘ఇంకో 3 ఏళ్లు కళ్లుమూసుకుంటే చాలు’

తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…

7 hours ago