ఇంటిలో తిరుగుతున్న ఫ్యాన్ కు బేరింగులు బాగుంటేనే దాని నుంచి నలుదిక్కులా గాలి వస్తుంది. శబ్ధం లేకుండా ఫ్యాన్ ఆహ్లాదాన్ని అందిస్తుంది. రాత్రి వేళ సుఖమయ నిద్రను అందిస్తుంది. ఫ్యాన్ లొని ఇతరత్రా పరికరాల కంటే బేరింగులే కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫ్యాన్ ను పట్టుకుని ఎన్నికల ప్రచారంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్ ఇంటిలో ఉండాలి.. టీడీపీ గుర్తు సైకిల్ ఇంటి బయట ఉండాలి, ఇక జనసేన గుర్తు గ్లాసు సింకులో ఉండాలంటూ రిథమిక్ డైలాగులు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తే… ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ కే బేరింగులు పూర్తిగా పాడైపోయాయని చెప్పక తప్పదు.
ఇక అసలు విషయంలోకి వస్తే… జగన్ అమలు చేసిన అమ్మ ఒడి మాదిరిగానే కూటమి సర్కారు ఇటీవలే తల్లికి వందనం పేరిట కార్యక్రమాన్ని ప్రారంబించింది. ఈ పథకంపై ఆది నుంచి కూడా తనదైన శైలి విమర్శలు గుప్పిస్తూ వస్తున్న వైసీపి ఎక్కడికక్కడ కూటమి పార్టీలను ప్రత్యేకించి టీడీపీని ఎద్దేవా చేసేందుకు వైసీపీ నేతలు చేయని యత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విమర్శలన్నింటినీ తట్టుకుని మరీ కూటమి సర్కారు తల్లికి వందనాన్ని ఘనంగా ప్రారంభించింది. ముందుగా చెప్పినట్టుగా ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్న కూటమి మాట తప్పలేదు. ఫలితంగా ఒక్కో ఇంటిలో ఐదుగురు, ఆరుగురు, కొన్ని కుటుంబాల్లో అయితే ఏకంగా 12 మంది పిల్లలకూ ఈ పథకం అందింది.
అయితే పథకం ప్రారంభం అయిన వెంటనే ఈ పథకం అమలు తీరుపై వైసీపీ తనదైన శైలి విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. తల్లికి వందనం రూ.15 వేల అని చెప్పి రూ.13 వేలు మాత్రమే ఇచ్చారన్న వైసీపీ…మిగిలిన రూ.2 వేలు లోకేశ్ ట్యాక్స్ కింద లోకేశ్ ఖాతాలకు మళ్లాయని ఆరోపించింది. ఈ ఆరోపణలపై టీడీపీ చాలా వేగంగా రియాక్ట్ అయ్యింది. అమ్మ ఒడిలో మీరు కూడా రూ.2 వేలు కట్ చేశారు కదా..మరి నాడు జగన్ ఖాతాలోకి వెళ్లాయా? అని ప్రశ్నించిన టీడీపీ… లోకేశ్ ఖాతాలోకి రూ.2 వేలు చేరినట్లుగా నిరూపించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్వయంగా లోకేశే రంగంలోకి దిగి డెడ్ లైన్ విధించడంతో వైసీపీ సైలెంట్ అయిపోయింది. సారీ చెప్పాలని లోకేశ్ హెచ్చరించినా ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మిన్నకుండిపోయింది.
ఇక ఆదివారం ఉదయం నుంచి వైసీపీ ఈ పథకంలో బారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఊదరగొట్టింది. ఒక తల్లికి 360 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ తల్లికి వందనం కింద డబ్బులు వేశారని, అలాగే చాలా మంది పేర్ల కింద 150, 100.. ఇలా ఇష్టారాజ్యంగా పిల్లల పేర్లు రాసుకుని టీడీపీ నేతలు ఈ పథకం డబ్బులను కాజేశారంటూ ప్రచారం మొదలెట్టింది. అయితే ఈ ఆరోపణలపైనా టీడీపీ మరింత వేగంగా రియాక్ట్ అయ్యింది. తల్లికి వందనం పథకాన్ని తాము అనాథ శరణాలయాల పిల్లలకూ అమలు చేస్తున్నామని చెప్పిన టీడీపీ… ఆ పెద్ద పెద్ద సంఖ్యలన్నీ రాష్ట్రంలోని ఆయా అనాథ శరణాలయాలకు చెందిన జాబితాలేనని తేల్చిచెప్పింది. అయినా ఏదో జాబితాల్లో దొరికింది కదా అని క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే విమర్శలు చేస్తే ఇలానే ఉంటుంది మరీ.
This post was last modified on June 15, 2025 8:51 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…